Breaking News

పనులన్నీ వదిలేసి వెళ్లిపోండి!

Published on Tue, 10/29/2024 - 03:21

‘మీరు చేస్తున్న పనులు ఉన్నది ఉన్నట్టుగా వదిలేసి వెళ్లిపొండి..! లేదంటే కేసులు ఎదుర్కోవడానికి సిద్ధపడండి..! మీ కంపెనీ తరఫున మేం పనులు చేస్తాం.. బిల్లులు కూడా మేమే తీసుకుంటాం..!’      – తస్మదీయ కాంట్రాక్టర్లకు టీడీపీ ముఖ్యనేతల అల్టిమేటం.

‘అలాగైతే.. మీరు చేసే అక్రమాలకు మేం బాధ్యత వహించాల్సి వస్తుంది..! మాకు ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చేసి.. ఏపీడీఎస్‌ఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ డీటెయిల్డ్‌ స్టాండర్డ్‌ స్ఫెసిఫికేషన్స్‌) 60 సీ నిబంధన కింద కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయండి! కావాలంటే ఈ వ్యవహారంపై మేం కోర్టులో సవాల్‌ చేయబోమని హామీ కూడా ఇస్తాం!’     – కాంట్రాక్టర్ల ప్రతిపాదన.

సాక్షి, అమరావతి:  గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన మాదిరిగానే 2014–19 తరహాలోనే 60 సీ నిబంధన కింద పనుల ఒప్పందాలను రద్దు చేసి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. అస్మదీయులకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునేందుకు టీడీపీ ముఖ్యనేతలు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకు వివిధ శాఖల పరి«ధిలో చేపట్టిన నిర్మాణ పనులపై కన్నేసి అస్మదీయ కాంట్రాక్టర్లను పనులు చేసుకునేందుకు అనుమతిస్తున్న టీడీపీ నేతలు.. తస్మదీయ కాంట్రాక్టర్లను మాత్రం అడ్డుకుంటున్నారు.

ఉన్నఫళంగా పనులు వదిలేసి వెళ్లిపోవాలంటూ హుంకరిస్తున్నారు. తమకే పనులు అప్పగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మీ కంపెనీ తరఫున పనులు చేస్తాం.. బిల్లులు మేం తీసుకుంటామని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంట్రాక్టు సంస్థలు ఒప్పుకోవడం లేదు. చేసిన పనుల్లో ఏవైనా లోపాలు తలెత్తితే వాటికి తాము బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తనకు రూ.2 వేల కోట్ల మేర బిల్లులు రావాలని.. వాటిని ఇప్పించి, తాను చేస్తున్న పనుల కాంట్రాక్టు ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని ఓ బడా కాంట్రాక్టు సంస్థ అధినేత టీడీపీ ముఖ్యనేతలకు సూచించారు.  

పాత విధానంలో దూకుడుగా
కాంట్రాక్టర్లు తమ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో 2014–19లో అమలు చేసిన విధానానికే టీడీపీ నేతలు మరింత పదును పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల పనుల వరకూ తస్మదీయ కాంట్రాక్టు సంస్థలు చేస్తున్న పనులను 60 సీ కింద రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన పనులకు 2024–25 ఎస్‌ఎస్‌ఆర్‌(స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌) ప్రకారం అంచనాలను రూపొందించి.. ఎక్కువ కమీషన్‌ ఇచ్చే కాంట్రాక్టర్లకు వాటిని కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)