Breaking News

విదేశీయులకు ప్రియమైన బంగినపల్లి

Published on Sat, 06/21/2025 - 06:03

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఉలవపాడు మామిడి విదేశీయులకు సైతం నోరూరిస్తోంది. ఈ ఏడాది కూడా ఉలవపాడు బంగినపల్లె రకం మామిడి అమెరికా, యూకెలకు ఎగుమతులు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడులోని బీ ష్యూర్‌ అగ్రి ఎక్స్‌పోర్ట్స్‌ ఆధ్వర్యంలో ఈ రెండు ప్రాంతాలకు ఎగుమతులు చేశారు. నాణ్యతలో ఎంపిక జరిగి వారి క్వాలిటీ కి అనుగుణంగా ఉన్న కాయలను మాత్రమే ఎగుమతులు చేశారు. బెంగళూరు లోని క్వాలిటీ తనిఖీ కేంద్రం నుంచి ఈ కాయలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. ఉలవపాడు ప్రాంతం నుంచి ప్రధానంగా బంగినపల్లె, రసాలు రకాలు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది సుమారు 10 టన్నుల పైనే ఎగుమతి అయ్యాయి. బంగినపల్లె రకం కవర్‌ కట్టిన కాయలు కేజీ రూ.140, కవర్‌ కట్టని కాయలు కేజీ రూ.100 చొప్పున నాణ్యత ఉన్న కాయలు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి క్వాలిటీ టెస్ట్‌ చేసి ఎగుమతులు చేశారు. – ఉలవపాడు

నాణ్యతే కీలకం
విదేశాలకు ఎగుమతులలో నాణ్యతే ప్రధానం. కాయలను ముందుగా కోసిన తరువాత వాటిలో తేమ ఇంకే వరకు కాయలను తిరగబెట్టి ఉంచాలి. తరువాత మచ్చలేకుండా ఉన్న కాయలను ఎంచుకోవాలి. తియ్యదనం కూడా కాస్త తక్కువగా ఉండాలి. విదేశాలలో తినే కాయలకు కాస్త తీపి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కవర్‌ కట్టిన కాయలలో వడగాలి, ఎండ తగలదు కాబట్టి తీపి శాతం తక్కువగానే ఉంటుంది. కానీ కవర్‌ కట్టని కాయలనే విదేశాలలో ఉన్న భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇలా గ్రేడింగ్‌ అయిన కాయలను బెంగళూరులోని క్వాలిటీ కంట్రోల్‌ లో తనిఖీ చేస్తారు. నాణ్యమైన రకంగా గుర్తించిన కాయలను విమానాలలో విదేశాలకు ఎగుమతులు చేస్తారు.

విదేశాలలో ఈ కాయలను హన్స్‌లెట్‌ లోని జీఓకారో లిమిటెడ్‌ వారు దిగుమతి చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. 3 కేజీలు, 4 కేజీల బాక్స్‌లలో వీటిని ఎగుమతి చేస్తారు. ఒక్కో బాక్స్‌లో షుమారు 7 నుంచి 9 కాయలు పట్టేలా ప్యాకింగ్‌ చేస్తారు. ఇక్కడ షుమారు ఈ బాక్స్‌ విలువ రూ.450 నుంచి రూ.550 వరకు ఉంటుంది. ఈ కాయలు అమెరికాలో 57 డాలర్లకు అమ్ముతారు.అంటే షుమారు రూ.4500 పడుతుంది. 9 కాయలను రూ.4500 కు అమ్ముతారు. అంటే ఒక్కో కాయ రూ.500 చొప్పున విదేశాలలో అమ్ముడవుతుంది. యూకేలో షుమారు 21 పౌండ్ల వరకు రేటు పలుకుతుంది. ఉలవపాడు బంగినపల్లె రకం మామిడి కాయ విదేశాలలో రేటు చూసి గర్వపడాల్సిందే.

నాణ్యత గల కాయలు ఎగుమతులు చేస్తున్నాం 
మా కంపెనీ ద్వారా విదేశాలకు మామిడి కాయలు ఎగుమతులు చేస్తున్నాం. రైతులు నాణ్యత గల కాయలు ఉంటే వాటిని బెంగళూరులో క్వాలిటీ చూసి పంపిస్తాం. ఈ ఏడాది అమెరికా, యూకేకు పంపించాం. కాయలు అద్భుతంగా ఉన్నాయని కొనుగోలు చేసిన కంపెనీ ప్రతినిధులు తెలిపారు. – వై.బాలచందర్, బీష్యూర్‌ అగ్రి ఎక్స్‌పోర్ట్స్, ఉలవపాడు 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)