Breaking News

తల్లి శవంతో నెల రోజులుగా ఇంట్లోనే..

Published on Tue, 03/18/2025 - 13:34

కడప కల్చరల్‌ : కడప నగరం శాటిలైట్‌సిటీ వద్దగల ఇంట్లో నెల రోజుల క్రితం ఓ వృద్దురాలు మరణించింది. ఆమెకు పెళ్లికాని 45–55 సంవత్సరాల వయస్సుగల ఇద్దరు కుమారులు మినహా ఇంకెవరూ లేరు. ఆమెకు వచ్చే పెన్షన్‌తోపాటు అక్కడ, ఇక్కడ చిన్న చితకా పనులు చేసి వారిని పోషించేది. నెల కిందట ఆమె మరణించింది. ఈ విషయం బయట ఎవరికీ తెలియదు. ఇద్దరు కుమారులు ఎవరితో మాట్లాడేవారు కాదు. 

తల్లి మరణించినా కూడా శవంతోపాటు అక్కడే ఉండిపోయారు. ఒక కుమారుడు మూడు రోజుల తర్వాత ఉరి వేసుకుని మరణించాడు. దుర్వాసన రావడంతో ఆ ప్రాంతీయులు పోలీసుల ద్వారా ఇంటిని పరిశీలించగా విషయం తెలిసింది. మున్సిపల్‌ సిబ్బంది ద్వారా మృతదేహాలను ఖననం చేయించారు. మిగిలిన పెద్ద కుమారుడు జనార్దన్‌ ఇల్లు వదిలి బయటే తిరుగుతూ ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో  స్థానికుల్లో ఒకరు పోరుమామిళ్లలోగల శ్రీ వివేకానంద ఆశ్రమ నిర్వాహకులు పాపిజెన్ని రామకృష్ణకు సమాచారం ఇచ్చారు. 

ఆయన తన బృందంతో వచ్చి కడప నగరం చెన్నూరు బస్టాండులో ఉండిన జనార్దన్‌ను వెతికి పట్టుకుని తన ఆశ్రమానికి తరలించారు. మొదట ఆశ్రమానికి వచ్చేందుకు అంగీకరించలేదు. మొత్తానికి ఆయనను ఒప్పించి ప్రత్యేక వాహనంలో ఆశ్రమానికి తీసుకెళ్లారు. మానసిక వైద్యం చేయించి శుభ్రంగా తీర్చిదిద్దారు. జనార్దన్‌ ప్రస్తుతం వ్యక్తులను గుర్తు పెట్టి మాట్లాడే స్థితికి వచ్చాడు. ఈ అవకాశం తనకు లభించడం సంతోషంగా  ఉందని ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)