Breaking News

‘టీ’లో ఈగల మందు

Published on Thu, 07/16/2026 - 10:13

శ్రీకాకుళం జిల్లా:  ఎచ్చెర్ల మండలం పొన్నాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో ఈగల మందు కలిసిన టీ తాగిన ఘటనలో పీఈటీ, సెక్యూరిటీ గార్డు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఘటన చోటుచేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం కేజీబీవీ వంటగదిలో తయారు చేసిన టీని సిబ్బంది, విద్యార్థులకు పంపిణీ చేశారు. కొంతసేపటి తర్వాత ఓ ప్రత్యేక పాత్ర(జగ్గు)లో ఉన్న టీని పీఈటీ సన్యాసమ్మ, సెక్యూరిటీ గార్డు టి.ఉష తాగారు. వాసన తేడాగా ఉండటంతో పీఈటీ కొంచెం మాత్రమే టీ తాగి ఉమ్మేశారు.

తోటమాలినే ఈ పని చేసింది: పీఈటీ ఆరోపణ 
పీఈటీ సన్యాసమ్మ కేజీబీవీలో తోటమాలిగా పనిచేస్తున్న ఓ మహిళ రెండు రోజుల కిందట కిచెన్‌లో పాలు తీసుకువెళ్లిపోతుండగా అడ్డుకుని ప్రశ్నించానని, ఇది మనసులో పెట్టుకుని టీలో ఈగల మందు కలిపిందని ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ సూర్యకళ మాట్లాడుతూ.. ఈగల మందు కలిసిన టీ తాగడంతో సిబ్బంది అస్వస్థతకు గురయ్యారని, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పారు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని తోటమాలి చెప్పిందని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)