జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?
Breaking News
వైజాగ్-విజయవాడ: నేటి నుంచి రెండు విమాన సర్వీసులు
Published on Sun, 10/27/2024 - 08:46
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్-విజయవాడ మధ్య ఈ నెల 27వ తేదీ నుంచి కొత్తగా రెండు విమాన సర్వీస్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ నగరాల మధ్య ఇండిగో ఎయిర్లైన్స్ ఒక విమానం నడుపుతోంది. ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఆదివారం నుంచి రెండో విమాన సర్వీస్ను ఇండిగో ప్రారంభించనుంది.
ఈ విమానం సాయంత్రం 7.30గంటలకు గన్నవరం నుంచి వైజాగ్ వెళ్లి, తిరిగి రాత్రి 9.50 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. ఇదేరోజున ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సంస్థ కూడా విశాఖ– విజయవాడ మధ్య కొత్త సర్వీస్ను నడపనుంది. దీనికోసం 180 మంది సామర్థ్యం కలిగిన బోయింగ్ 737 విమానాన్ని కేటాయించింది. ఈ విమానం వైజాగ్ నుంచి ఉ.10.35 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి రాత్రి 7.55కు వైజాగ్ బయలు దేరుతుంది. విజయవాడ–వైజాగ్ మధ్య ప్రారంభ టికెట్ ధరను రూ.3,014గా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ నిర్ణయించింది.
Tags : 1