Breaking News

దళిత యువకులపై సీఐ దాష్టీకం

Published on Sat, 09/27/2025 - 05:17

మార్టూరు: బాపట్ల జిల్లాలో ఇద్దరు దళిత యువకుల్ని పోలీస్‌ స్టేషన్‌లో దారుణంగా హింసించారు. టీడీపీ నేతలు చేయించిన తప్పుడు ఫిర్యాదుతో శుక్రవారం వారిని స్టేషన్‌కు పిలిపించి బూటుకాళ్లతో సీఐ తొక్కిపట్టి ఇద్దరు పోలీసులతో అరికాళ్లపై లాఠీలతో కొట్టించారు. తరువాత మరింత అమానుషంగా గులకరాళ్లపై నడిపించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదేగతి పడుతుందని హెచ్చరించారు. మార్టూరు మండలం డేగరమూడికి చెందిన బాధిత యువకులు శుక్రవారం డేగరమూడిలో ఈ దారుణం గురించి వివరించారు. 

సీఐ మీద చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. బాధితుల కథనం మేరకు.. డేగరమూడిలో నెలరోజులుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహస్థాపన విషయమై వివాదం నెలకొంది. సర్పంచ్‌ భర్త, వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్‌ జంపని వీరయ్యచౌదరి సహాయంతో స్థానిక ఎస్సీ కాలనీ యువకులు అల్లడి ప్రమోద్‌కుమార్, జ్యోతి పోతులూరి ఈ విగ్రహస్థాపనలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిమీద కక్షగట్టిన స్థానిక అధికారపార్టీ నాయకులు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించారు. 

గ్రామానికి చెందిన అన్నం హనుమంతరావుతో టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. తరువాత హనుమంతరావును పోలీస్‌ స్టేషన్‌కు పంపించి.. దళిత యువకులు ప్రమోద్‌కుమార్, పోతులూరి  ఫ్లెక్సీలు తొలగించారంటూ తప్పుడు ఫిర్యాదు చేయించారు. రంగంలోకి దిగిన సీఐ శేషగిరి  శుక్రవారం ఉదయం ప్రమోద్‌కుమార్, పోతులూరిలను స్టేషన్‌కు పిలిపించారు. వాళ్లు వచ్చీరాగానే రాజకీయాలు మీకు అవసరమంట్రా అంటూ నానా దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. వారిని గదిలో గోడపక్కన కూర్చోబెట్టి వారి కాళ్లను సీఐ శేషగిరి బూటుకాళ్లతో తొక్కిపట్టారు. 

ఇద్దరు సిబ్బంది లాఠీలతో ఆ యువకుల అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలతో వారి అరికాళ్లపై బొబ్బలొచ్చాయి. తరువాత సీఐ ఆ ఇద్దరిని బొబ్బలు తగ్గేవరకు కంకరరాళ్లపై నడిపించారు. తరువాత వారిద్దరితో తెల్లకాగితాల మీద సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదేగతి పడుతుందని హెచ్చరించి మధ్యాహ్నం వదిలిపెట్టారు.  

Bapatla District: దళిత యువకులపై కక్ష కట్టిన టీడీపీ నేతలు

తప్పుడు ఫిర్యాదు చేయించారు  
స్టేషన్‌ నుంచి ఇంటికి వచ్చిన బాధిత యువకులు తమపై తప్పుడు ఫిర్యాదు చేసిన అన్నం హనుమంతరావును ఇలా ఎందుకు చేశావని నిలదీశారు. గ్రామ నాయకులు మద్యం పోయించి, కొట్టి, తనచేత ఫ్లెక్సీలు తొలగింపజేశారని, తరువాత డబ్బిస్తామని ఆశచూపి ఫిర్యాదు చేయమంటే చేశానని హనుమంతరావు చెప్పాడు. హనుమంతరావు చెప్పిన ఈ విషయాన్ని బాధిత యువకులు వీడియో రికార్డు చేశారు. తమను హింసించిన సీఐపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వారు జిల్లా ఎస్పీని కోరారు.  

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు