Breaking News

Andhra Pradesh: హైకోర్టుకు ఇద్దరు అదనపు జడ్జిలు

Published on Thu, 01/23/2025 - 05:17

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు నియమి­తుల­య్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ఇద్దరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి  జగన్నాథ్‌ శ్రీనివాసన్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ ఇద్దరూ శుక్రవారం అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. తరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. 

రాష్ట్ర హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి 28 మంది న్యాయమూర్తులున్నారు. వీరిద్దరి నియామకంతో ఆ సంఖ్య 30కి చేరింది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో మూడు, నాలుగు పోస్టులు భర్తీ చేసేందుకు హైకోర్టు త్వరలో చర్యలు చేపట్టనుంది. న్యాయాధికారుల కోటా నుంచి హరిహరనాథ శర్మ, లక్ష్మణరావుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారస్‌ చేస్తూ సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 11న తీర్మానం చేసిన విషయం తెలిసిందే. 

అవధానం హరిహరనాథ శర్మ...
కర్నూలుకి చెందిన హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్‌ 16న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితుడు. శర్మ 1988లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీ నుంచి బీఎస్సీ, అదే కాలేజీ నుంచి 1993లో బీఎల్‌ పూర్తి చేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. అనంతరం కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. 1994 నుంచి 98 వరకు సీనియర్‌ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 

1998లో స్వతంత్రంగా ప్రాక్టీస్‌ ప్రారంభించి 2007 వరకు న్యాయవాదిగా కొనసాగారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2017–18లో అనంతపురం ప్రధాన జిల్లా జడ్జిగా, 2020–22లో విశాఖపట్నం ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి ఏపీ జుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2016లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు.

డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు...
ఉమ్మడి ప్రకాశం జిల్లా, కనిగిరికి చెందిన డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. తల్లిదండ్రులు పద్మావతి, వెంకటేశ్వర్లు. తండ్రి నెల్లూరు రహదారులు భవనాల శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. లక్ష్మణ రావు ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్‌ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్‌ సర్టిఫికెట్లు సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. క్రిమినల్‌ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 



ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా కావలిలో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అనంతరం 2014లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్‌ సాధించారు. మొదట ఏలూరులో మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. తరువాత రాష్ట్రంలో పలు చోట్ల వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్‌ (జుడీషియల్‌)గా నియమితులయ్యారు. ఆయన పనితీరు, క్రమశిక్షణ నచ్చిన హైకోర్టు ఆయనను రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ)గా నియమించింది. 2038 వరకు లక్ష్మణరావు హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటారు. 

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)