Breaking News

తిరుపతిలో జంట హత్యలు

Published on Thu, 07/09/2026 - 05:34

తిరుపతి క్రైం: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపం సముదాయంలో బుధవారం రాత్రి జంట హత్యలు కలకలం రేపాయి. ఒక మహిళతో పా­టు నలుగురు వ్యక్తులు వెంటాడి వేటాడి కత్తు­లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో జీవ­కోన ప్రాంతానికి చెందిన మునిరత్నం(50) ఘట­నా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయ­పడి­న సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన మణికంఠ­(41)­ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందు­తూ ప్రాణాలు విడిచాడు. పోలీసు­లు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మావతి కళ్యా­ణ మండపం సముదాయంలో నాలు­గు కళ్యాణ మండపాలున్నాయి. 

బుధవా­రం రాత్రి ఒక మండపంలో వివాహం జరు­గు­తోంది. రాత్రి 9.30 గంటల సమయంలో కొందరు దుండగులు రెండు బైక్‌లపై అక్కడికి చేరుకున్నారు. కల్యాణ మండపం సముదాయంలో­ని నిర్మా­ను­ష్య ప్రాంతంలో మునిరత్నం, మణికంఠపై వారు దాడి చేశారు. మునిరత్నం, మణికంఠ చిరు­వ్యా­పా­రులు. మునిరత్నం రెండు నెలల కిందట ఓ వివా­హం జరిపించాడు. దాని నేపథ్యంలో ఏర్ప­డి­న వివాద­మే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చ­ని పోలీ­సులు భావి­స్తున్నా­రు. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఘటన­లోని కొన్ని దృశ్యాలను పద్మావతి కళ్యాణ మండపంలో విధులు నిర్వర్తిస్తున్న వాచ్‌­మన్‌ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినట్టు తెలిసింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)