తిరుమల వెళ్లే భక్తుడి బ్యాగులో తాబేలు..ఆరా తీస్తే..!

Published on Sun, 08/17/2025 - 17:54

తిరుమల: తరుమల కొండపైకి వెళ్లే భక్తులను తనిఖీలు చేయడమనేది సర్వసాధారణం. ఇలా ఒక భక్తుడ్ని తనిఖీ చేస్తే అతని బ్యాగులో తాబేలు కనిపించింది. ఇది అక్కడ తనిఖీ చేసే సిబ్బందికి కూడా కొత్తగానే అనిపించింది. తాబేలు ఏంటి.. బ్యాగులో ఎందుకు తీసుకెళుతున్నావ్‌ అని సదరు భక్తుడిని అడిగితే దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది. తనకు దారిలో దొరికిందని, బ్యాగులో వేసుకున్నానని బదులిచ్చాడు. ఏమైనా విలువైన వస్తువులు దొరికితే దాన్ని దాచుకుంటారు.

మరి మనోడు తాబేలను బ్యాగులో వేసుకున్నానంటూ చెప్పిన సమాధానంతో  అక్కడ సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. సర్లే అనుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది. ఆ తాబేలును ఫారెస్ట్‌ అధికారులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. అసలు తాబేలు కనిపిస్తే బ్యాగులో వేసుకున్నానంటూ అతను చెప్పిన సమాధానం చూస్తే నవ్వొస్తుంది కదూ.. ఇది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద చోటు చేసుకున్న ఘటన. తనిఖీలు చేస్తున్న క్రమంలో తాబేలు వ్యవహారం వెలుగుచూసింది. 


తాబేళును స్వాధీనం చేసుకున్న విజిలెన్స్‌ అధికారులు

#

Tags : 1

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)