Breaking News

పసుపు రైతులకు ఇచ్చేది రూ.7 వేలే!

Published on Fri, 07/12/2024 - 05:34

తెనాలి: గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పసుపు నిల్వలను నష్టపోయిన రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేల చొప్పున మాత్రమే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుత మార్కెట్‌లో ధరను దృష్టిలో పెట్టుకుని క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని పసుపు రైతుల సంఘం కోరింది.

బీమా పరిహారం కలిపి క్వింటాల్‌కు రూ.7 వేలకు మించి ఇవ్వలేమని సర్కారు చేతులెత్తేసింది. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేల చొప్పున చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. 

గురువారం తెనాలిలో సబ్‌ కలెక్టర్‌ ప్రఖర్‌జైన్‌ను పసుపు శివసాంబిరెడ్డి, పలువురు రైతులు కలిశారు. శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం విజ­య­వాడ మార్క్‌ఫెడ్‌ కార్యాల­యంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నా­యుడు సమక్షంలో రైతులు, అధికారులు కోల్డ్‌ స్టోరేజీ యజమానితో చర్చలు జరిపి అంగీకార ఒప్పందం సంతకాలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని కోరినట్టు చెప్పారు.

బీమా పరి­హారంతో కలిపి రూ.7 వేలకు మించి ఇవ్వలేమని మంత్రి వెల్లడించగా.. రైతులు అయి­ష్టంగానే అంగీకరించారని తెలిపారు. దీనివల్ల పసుపు రైతులు రూ.20 కోట్లు నష్టపోయినట్టు శివసాంబిరెడ్డి, చందు సత్యనారా­యణ తెలియజేశారు. చర్చల్లో బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్‌ వేములపల్లి వెంకటరామయ్య, దేవభక్తుని నాగ వీరబసవయ్య, నాదెండ్ల చంద్రశేఖరరావు, గద్దె శ్రీహరి, భీమ­వరపు సీతారామిరెడ్డి, బొల్లిమంత రామా­రావు, తుంగల వీరరాఘవులు పాల్గొన్నట్టు వివరించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)