Breaking News

తిరుమలలో నేడు ఆణివార ఆస్థానం

Published on Mon, 07/17/2023 - 07:20

సాక్షి, తిరుపతి: తిరుమలలో ఇవాళ(సోమవారం, జులై 17) శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను సైతం రద్దు చేసింది. ఇక సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా.. బంగారం వాకిలిలో ఆస్థానం నిర్వహిస్తారు అర్చకులు. ఆపై స్వామివారికి రూపాయి హారతి ఇస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పుష్ప పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. 

సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి శ్రీవారి ఆలయం ఇప్పటికే ముస్తాబయ్యింది. ఉదయం బంగారువాకిలి ముందు ఘంటా మండపంలో ఉభయదేవేరుల సమేతంగా మలయప్పస్వామివారు గరుత్మంతుడికి అభిముఖంగా, మరో పీఠంపై స్వామివారి విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేయనున్నారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించనున్నారు.

ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. గతంలో ఆణివార ఆస్థానం రోజు నుండి శ్రీవారి ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేది. అయితే టీటీడీ ఏర్పడ్డాక ఏప్రిల్ నుండి ఆదాయ వ్యయాలు అనుసరిస్తూ వస్తోంది.

జియ్యంగార్ల వస్త్ర సమర్పణ
తిరుమల పెద జియ్యర్‌ స్వామి వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ‘పరివట్టం’ కట్టుకొని బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామిని ఆశీర్వదిస్తారు.

భక్తులకు శుభవార్త
భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను రోజుకు 4వేలు చొప్పున అదనంగా విడుదల చేస్తామని, ఇప్పటికే రోజుకు 20వేల టికెట్లను కేటాయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారమే శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.

కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

ఇదీ చదవండి: వాళ్లకు డబ్బులు ఇవ్వకండి.. భక్తులకు ఈవో సూచన

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు