Breaking News

భక్తుడిపై టీటీడీ సిబ్బంది దురుసు ప్రవర్తన

Published on Mon, 02/09/2026 - 03:47

చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ సిబ్బంది తీరు పలు వివాదాలకు దారితీస్తోంది. విజయవాడకు చెందిన పృథ్వీ ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చాడు. రూ.50 టికెట్‌ తీసుకుని క్యూలో దర్శనానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన తన బ్యాగ్‌లో సెల్‌ఫోన్‌ ఉంచుకున్నాడు. లగేజీ స్కానింగ్‌ వద్ద ఆలయ సిబ్బంది పృథ్వీ బ్యాగ్‌లో సెల్‌ఫోన్‌ను గుర్తించి, అతడిని అడ్డుకుని, సెల్‌ఫోన్‌ను లాకర్‌లో ఉంచి రావాలని సూచించారు. 

క్యూలో ప్రవేశించే సమయంలో తనను ఎవరూ తనిఖీ చేయలేదని, సెల్‌ఫోన్‌ నిషేధం గురించి తనకు తెలియదని వారికి పృథ్వీ చెప్పాడు. ఆపై సిబ్బంది సూచనల మేరకు అత్యవసర గేటు నుంచి వెళ్లి సెల్‌ఫోన్‌ను లాకర్‌లో ఉంచాడు. అనంతరం అత్యవసర గేటు వద్దకు వచ్చి దర్శనానికి అనుమతించాలని సిబ్బందిని కోరాడు. అయితే ఇక్కడి నుంచి పంపించడం కుదరదని, తిరిగి క్యూలో రావాలని పృథ్వీకి సిబ్బంది చెప్పారు. 

గంటకు పైగా క్యూలైన్‌లో ఉండి తాను ఇక్కడ వరకు వచ్చానని, సెల్‌ఫోన్‌ ఉండడంతో మీ సూచనల మేరకు ఫోన్‌ను లాకర్‌లో ఉంచి వచ్చానని పృథ్వీ చెబుతున్నా అక్కడి సిబ్బంది వినలేదు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ తనపై బూతులతో రెచ్చిపోయాడని బాధితుడు వాపోయాడు. పరుష పదజాలంతో దూషిస్తూ తనపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 

తనను ఎందుకు బూతులు తిడుతున్నారని ప్రశ్నించగా.. అక్కడున్న సిబ్బంది అంతా తనను కొట్టి, బయటకు గెంటివేశారని వివరించాడు. తనపై దాడికి పాల్పడిన సిబ్బందిపై టీటీడీ చర్యలు తీసుకోవాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులపై ఇలా దాడులు చేసి, టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.  

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య