టీటీడీ కీలక నిర్ణయం.. నడక మార్గంలో ఆంక్షలు ఇవే..

Published on Sun, 08/13/2023 - 16:08

సాక్షి, తిరుమల: చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు నడక మార్గాల్లో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు టీటీడీ అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొంది. 

వివరాల ప్రకారం.. ఇటీవల తిరుమలకు నడకదారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్లమార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. రేపటి(సోమవారం) నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్ని తర్వాతే చిన్నారులను పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతించనున్నట్టు టీటీడీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండవ ఘాట్‌ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్‌లకు నో ఎంట్రీ అని స్పష్టం చేసింది. 

మరోవైపు.. తిరుమలలో చిరుత కోసం ఆపరేషన్  కొనసాగుతోంది. చిన్నారి లక్షిత పై దాడిచేసిన చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు ప్రాంతాలలో బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. చిరుత సంచారంపై నిఘా వేశారు. ఇందుకోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. చిరుత జాడను కనిపెట్టడానికి  దాదాపు 500 కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత భయంతో నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతోంది టీటీడీ అధికారులు.

ఇది కూడా చదవండి: తిరుమల నడకమార్గంలో హైఅలర్ట్‌ జోన్‌ ప్రకటన 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)