Breaking News

సామాన్య భక్తుడికే తొలి ప్రాధాన్యం

Published on Thu, 04/20/2023 - 08:00

తిరుమల : శ్రీవారి దర్శనంలో టీటీడీ  సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తోంది. మే, జూన్, జూలై మాసాల్లో కోనేటిరాయుడి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం వున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిత్యం వేలాదిగా శ్రీవారి దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.టిక్కెట్లు పొందిన భక్తులు వారి కి కేటాయించిన సమయానికి క్యూలైన్‌ వద్దకు వస్తే రెండు, మూడు గంటల్లోనే   స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.

అలాగే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ, సహస్రదీపాలంకార సేవా టిక్కెట్ల కోటాను గురువారం ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే సుప్రభాతం, అర్చన, తోమాల, వారపుసేవలైన అష్టధళపాదపద్మారాధన సేవా టిక్కెట్లకు  సంబంధించి ఎల్రక్టానిక్‌ డిప్‌ కోసం గురువారం ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో భక్తులకు టిక్కెట్లను కేటాయించనుంది. ఇక గురువారం మధ్యాహ్నం 3గంటలకు  జూలై మాసం శ్రీవాణి ట్రస్టు టిక్కెట్ల ఆన్‌లైన్‌ కోటా విడుదల చేయనుంది. ఈ నెలæ 21వ తేదీన ఉదయం 10 గంటలకు  జూలై మాసం అంగప్రదక్షిణ టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈనెలæ 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. 24న మే మాసం వర్చువల్‌ ఆర్జిత సేవాటిక్కెట్ల కోటాని అందుబాటులో ఉంచనుంది.

మే, జూన్‌ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను ఈనెలæ 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. నిత్యం 10వేల నుంచి 12వేల టిక్కెట్ల లెక్కన దాదాపు 7లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లని భక్తులకు  అందుబాటులో ఉంచనుంది. మే నెల గదుల కోటాను ఈనెలæ 26న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈక్రమంలోనే ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకని వారు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలో 1,240వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)