Breaking News

దర్శనాల కోసం దళారులను సంప్రదించొద్దు

Published on Sun, 06/23/2024 - 05:18

తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం దళారులను సంప్రదించవద్దని టీటీడీ ఒక ప్రకటనలో భక్తులకు విజ్ఞప్తి చేసింది. తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో కొంతమంది ఫోన్‌ నంబర్లతో కూడిన సమాచారంతో ప్రచారం జరుగుతోంది. 

వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు టీటీడీ కొన్ని టికెట్లను కేటాయించింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం విభాగాల ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉందని టీటీడీ తెలియజేసింది. 

టూరిజం విభాగాల ద్వారా రావాలనుకునే భక్తులు నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్‌సైట్‌ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్లు పొందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కొందరు దళారులు టూరిజం వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసి ఇస్తామని చెప్పి భక్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై టీటీడీ విజిలెన్స్‌ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అలాగే శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)