Breaking News

చింతించడం తప్ప చేసేదేమీ లేదు

Published on Thu, 01/09/2025 - 05:23

తిరుమల: తిరుపతిలోని బైరాగిపట్టెడలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై చింతించడం తప్ప చేసేదేమీ లేదని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు. బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘పొరపాటు జరిగిపోయింది. చింతించడం తప్ప మనం చేసేదేమీ లేదు’ అన్నారు. అధికారుల వైఫల్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. 

ఒక సెంటర్‌లో భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీయడంతో ఒక్కసారిగా భక్తులు ప్రవేశించారని.. దీంతో తొక్కిసలాట జరిగి భక్తులు మృతిచెందినట్టు ప్రాథమికంగా సమాచారం అందిందని తెలిపారు. మరో 20, 25 మంది వరకు క్షతగాత్రులు రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.  

సీఎం అసహనం వ్యక్తం చేశారు 
టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం చంద్రబాబు తనతోను, టీటీడీ అధికారులతోను మాట్లాడారని బీఆర్‌ నాయుడు తెలిపారు. ఘటనపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు చెప్పారు. అధికారుల వైఫల్యంతోనే ఇటువంటి ఘటన చోటుచేసుకుందని, అధికారులు చాలా ఈజీగా తీసుకున్నారని సీఎం పేర్కొన్నారన్నారు. సీఎంవో, డీజీపీ కార్యాలయాలు సైతం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించాయని వెల్లడించారు. పరిస్థితిని ఈవో శ్యామలరావు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. 

ఇందులో ఎటువంటి కుట్ర లేదని.. ప్రమాదవశాత్తు మాత్రమే దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలను, గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు గురువారం తిరుపతి వస్తున్నట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారని పేర్కొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)