Breaking News

తిరుమలలో నేడు ఉట్లోత్సవం.. ఆర్జిత సేవలు రద్దు

Published on Fri, 09/08/2023 - 07:53

సాక్షి, తిరుపతి:  తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ మొత్తం భక్తులతో నిండిపోయి ఉంది. బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది.  ఇక.. ఇవాళ తిరుమల మాడవీధులలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. దీంతో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఆయా సమయాల్లో ఉట్లోత్సవం, మలయప్ప స్వామివారి ఊరేగింపు ఉంటుందని పేర్కొంది.

తిరుమలలో ఈ సాయంత్రం 4 గంటల‌ నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆలయ నాలుగు మాడ వీధులలో అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. తిరుమాడ వీధులలో ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తీసుకొస్తారు. ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ్టి..  కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

శ్రావణ మాసం ముగింపు కావడంతో.. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ క్యూ కాంప్లెక్స్‌ నిండిపోయి.. భక్తులు బయట క్యూ లైన్‌లలో నిల్చున్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.  నిన్న(సెప్టెంబర్‌ 7, 2023)  58,855 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో.. 29,014 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం రూ. 4.65 కోట్లుగా లెక్కతేలింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)