Breaking News

19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూలై కోటా విడుదల

Published on Fri, 04/18/2025 - 08:48

తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన జూలై నెల కోటాను ఏప్రిల్‌ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఏప్రిల్‌ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్‌ 21–23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

 కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్ల జూలై కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూలై నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్ల జూన్‌ నెల ఆన్‌లైన్‌ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి దర్శనం టోకెన్ల జూలై కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

24న ఎస్‌ఈడీ కోటా విడుదల 
జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను 24న మ«­ద్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.https://ttdevasthanams.­ap.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే ఆయా టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.­ 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు