Breaking News

పార్టీషన్‌ డీడ్‌ను ట్రిబ్యునళ్లు రద్దు చేయలేవు

Published on Sat, 07/11/2026 - 03:42

సాక్షి, అమరావతి: తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం ప్రకారం ఆస్తి పార్టీషన్‌ డీడ్‌ (విభజన పత్రం)ను రద్దు చేసే అధికారం ఆర్డీవో నేతృత్వంలోని ట్రిబ్యునల్‌కు గానీ, జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌కు గానీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్‌ నేతృత్వంలోని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఒక తీర్పును రద్దు చేసింది.  కాగా ఈ చట్టం ప్రకారం ఆస్తి బదిలీ (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పాపర్టీ) విషయంలో మాత్రం ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోవచ్చునని పేర్కొంది.   

చట్టం ప్రకారం ట్రిబ్యునళ్లు ఆస్తి బదిలీని రద్దు చేయాలంటే తప్పనిసరిగా వర్తించాల్సిన అంశాలను కూడా హైకోర్టు వివరించింది.  ‘చట్టం అమల్లోకి వచ్చిన తరువాత వృద్ధులు తమ ఆస్తిని వేరొకరికి బదిలీ చేసి ఉండాలి. అలాగే ఆస్తి తీసుకునే వ్యక్తి ఆస్తి బదిలీ పత్రంలో ఆ వృద్ధుల అవసరాలు తీరుస్తాననే నిబంధనను తప్పనిసరిగా పొందుపరిచి ఉండాలి. సదరు వృద్ధుల పట్ల తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఆస్తిని తీసుకున్న వ్యక్తి విఫలమవ్వాలి’’ అని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు.

కుమారుడిపై తల్లి ఫిర్యాదు
పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన రామలక్ష్మి, ఆమె కుమారుడు శ్రీరామమూర్తి 2018లో ఉమ్మడి ఆస్తులను విభజించుకుని ఎవరికి రావాల్సిన ఆస్తులను వారు తీసుకున్నారు. కొద్ది కాలం తరువాత తన కుమారుడు తనను సక్రమంగా చూడటం లేదని, అందువల్ల ఆస్తి విభజన పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం ప్రకారం రామలక్ష్మి ఆర్డీవో నేతృత్వంలోని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 

విచారణ జరిపిన ఆర్డీవో ఆస్తి విభజన పత్రాన్ని రద్దు చేసేందుకు నిరాకరించారు. దీంతో కలెక్టర్‌ నేతృత్వంలోని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌కు రామలక్ష్మి వెళ్లారు. కలెక్టర్‌ విచారణ జరిపి రామలక్ష్మి  కోరిన విధంగా ఆస్తి పార్టీషన్‌ డీడ్‌ను రద్దు చేస్తూ 2023లో తీర్పునిచ్చారు. దీనిని సవాలు చేస్తూ రామలక్ష్మి కుమారుడు శ్రీరామమూర్తి, ఆయన భార్య, కుమారుడు, కోడలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కలెక్టర్‌ నేతృత్వంలోని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ తీర్పును రద్దు చేశారు.  

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)