Breaking News

కాఫీ రైతుకు గిట్టుబాటు ధరేది?

Published on Fri, 11/07/2025 - 04:43

నాణ్యత పరంగా అంతర్జాతీయంగా పేరొందిన మన్యం కాఫీ పంటకు గిట్టుబాటు ధర ప్రకటనలో జాప్యం జరుగుతోంది. ఈఏడాది తోటలన్నీ అధిక దిగుబడితో కళకళాడుతున్నాయి. చాలా చోట్ల గిరిజన రైతులు పండ్ల సేకరణ మొదలుపెట్టారు. అయితే కాఫీ పండ్లు, పాచ్‌మెంట్‌ గింజల కొనుగోలుకు సంబంధించి పాడేరు ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు డివిజన్‌ పరిధిలో 1.50లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. ఏటా సుమారు 17వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజలను గిరిజన రైతులు విక్రయిస్తారు. కాఫీ గింజల కొనుగోలు ధరల ప్రకటనలో గిరిజన సహకార సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. 

⇒  కాఫీ గింజల సీజన్‌కు ముందే జీసీసీ అపెక్స్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించి పాచ్‌మెంట్, చెర్రీ రకం కాఫీ గింజల కొనుగోలు ధరలను ప్రకటించాల్సి ఉంది.అయితే నవంబర్‌ నెల ప్రారంభమై,గిరిజన రైతులు కాఫీ పండ్ల సేకరణ చేపడుతున్న ఇంతవరకు జీసీసీ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. గతేడాది పాచ్‌మెంట్‌ను కిలో రూ.40, చెర్రీ రకం కిలో రూ.250 చొప్పునర 752 టన్నులను మాత్రమే కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు ధరలు ప్రకటించకపోవడంతో కొనుగోలు విషయంలో ఆ సంస్థ వైఖరి కాఫీ రైతులకు అర్థం కావడం లేదు.  

⇒ పాడేరు ఐటీడీఏ కూడా కాఫీ పండ్ల «కొనుగోలు ధరను ప్రకటించడంలో ఆలస్యం చేస్తోంది. గతేడాది కాఫీ పంటను పండ్ల దశలోనే కిలో రూ.43 ధరతో చింతపల్లి మాక్స్‌ సంస్థ ద్వారా ఐటీడీఏ కొనుగోలు చేసింది. సుమారు 5వేల కిలోల వరకు కాఫీ పండ్లను ఐటీడీఏ సేకరించింది.అయితే ఈ ఏడాది సీజన్‌ ప్రారంభమైనా కాఫీ పండ్ల ధరను ఐటీడీఏ ప్రకటించలేదు. ప్రస్తుతం సేకరించిన పండ్లను ప్రైవేట్‌ వ్యాపార సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఐటీడీఏ ధర ప్రకటన కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. 

మన్యం కాఫీ గింజలకు గిరాకీ 
నాణ్యతలో నంబర్‌ వన్‌గా నిలుస్తున్న మన్యం కాఫీగింజలకు బెంగళూరు కాఫీ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. గత ఏడాది మన్యం నుంచి పంపిన కాఫీ పాచ్‌మెంట్‌ గింజలకు కిలో రూ.500ధరతో వ్యాపారం జరిగింది. ఈ ఏడాది మాత్రం ఇదే ధరతో మన్యంలో జీసీసీతో పాటు ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏజెన్సీలో 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. 

ఎకరాకు   600కిలోల మేర పండ్లు దిగుబడి వస్తుంది. వీటిని గిరిజన రైతులు అమ్మకుండా పలి్పంగ్‌ చేసి పాచ్‌మెంట్‌ కాఫీ గింజలుగా తయారు చేసుకుంటే సుమారు 200 కిలోల దాటే మార్కెట్‌ చేస్తారు. గత ఏడాది కిలో రూ.400 ధరతో అమ్ముకున్న గిరిజన రైతులు ఎకరానికి రూ.80 వేల వరకు ఆదాయం పొందారు. నాణ్యమైన కాఫీ గింజల దృష్ట్యా ఈ సీజన్‌లో కిలో పాచ్‌మెంట్‌ రూ.500, పండ్లు కిలో రూ.100 ధరకు కొనుగోలు చేయాలని కాఫీ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

కిలో రూ.500కు కొనాలి 
గత ఏడాది బెంగళూరు మార్కెట్‌లో అధిక ధరలతో జీసీసీతో పాటు అన్ని వ్యాపార సంస్థలు కాఫీ గింజలను అమ్మి మంచి లాభాలు పొందాయి. గిరిజన రైతుల వద్ద మాత్రం ప్రారంభంలో తక్కువ ధరకు కొనుగోలు చేసి మోసం చేశాయి. ఈ ఏడాది కిలో రూ.500తో పాచ్‌మెంట్‌ను జీసీసీ కొనుగోలు చేయాలి. – పాలికి లక్కు,కాఫీ రైతుల సంక్షేమ సంఘ ప్రతినిధి, పాడేరు

కాఫీ పండ్లు కిలో రూ.100కు అమ్ముతాం 
కాఫీ పండ్లను కూడా ఐటీడీఏ,పలు రైతు ఉత్పత్తి సంఘాలు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.గత సీజన్‌లో ఐటీడీఏ కిలో రూ.43తో పండ్లను కొనుగోలు చేయడంతో తామంతా మోసపోయాం. ఈసీజన్‌లో కిలో పండ్లను రూ.100 ధరతో అమ్మాలని నిర్ణయించాం. 
– మర్రి జ్యోతి, కాఫీ మహిళా రైతు, గుర్రగరువు, పాడేరు మండలం

త్వరలో కొనుగోలు ధర ప్రకటన 
ఈసీజన్‌లో కాఫీ పంటకు గిట్టుబాటు ధర కల్పించి గిరిజన రైతులకు న్యాయం చేస్తాం. జీసీసీ అధికారులతో మాట్లాడడం జరిగింది.అపెక్స్‌ కమిటీ సమావేశం ఈవారంలో నిర్వహించి  జీసీసీ ద్వారా పాచ్‌మెంట్, చెర్రీ రకం కాఫీ గింజల కొనుగోలు ధరలు ప్రకటిస్తాం.ఐటీడీఏ పండ్ల కొనుగోలు ధరపై సమావేశం నిర్వహిస్తాం. – ఏఎస్‌ దినేష్ కుమార్, కలెక్టర్, పాడేరు 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)