Breaking News

ఉచితం అన్నారు.. దోచేస్తున్నారు

Published on Sat, 07/27/2024 - 05:58

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానాన్ని అత్యంత పారద­ర్శకంగా అమలు చేశాం. ఫలితంగా ఏటా ప్రభు­త్వ ఖజానాకు రూ.765 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,825 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు చంద్రబాబు హయాంలో ఈ ఆదాయం అంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఎవరెవరు ఎంత పంచుకున్నారో చెప్పగలరా?’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 

ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా, సామాన్య ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను అందు­బాటులో ఉండేలా చూస్తే అవినీతి జరిగిపో­యిందంటూ లేనిపోని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని నమ్మబలికి, తీరా ఇప్పుడు ఉచిత ఇసుక మచ్చుకైనా కన్పించని విధంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇసుక పాలసీపై చంద్ర­బాబు విడుదల చేసిన వైట్‌ పేపర్‌పై జగన్‌ ఫ్యాక్ట్‌ పేపర్‌ ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా జగన్‌ ఏమన్నారంటే.. 

ఏ రేటుకు అమ్మాలో పత్రికల్లో ప్రచారం చేసే వాళ్లం
ఉచిత ఇసుక పేరిట జరిగిన దోపిడీకీ అడ్డుకట్ట వేస్తూ 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అత్యంత పారదర్శకంగా ఇసుక పాలసీని తీసుకొచ్చాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వ­ర్యంలో కాకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా టెండర్లు పిలిచాం. ఈ టెండర్లలో ఎవరైనా పాల్గొన­వచ్చు. చంద్రబాబు, రామోజీ మనుషులే కాదు.. ఎవరైనా నేరుగా పాల్గొనే అవకాశం ఉంది. 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల మినిమమ్‌ గ్యారంటీ పెడుతూ ఏటా రూ.765 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కట్టేలా చర్యలు తీసుకున్నాం. ఫలితంగా ఐదేళ్లలో రూ.3,825 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 

పైగా ప్రతి టన్నుకు రూ.375 చొప్పున ముందుగా ప్రభుత్వానికి రాయిల్టీ చెల్లించిన తర్వాతే ఇసుక తవ్వే కార్య­క్రమం చేపట్టాం. ఇలా తవ్విన ఇసుకను రీజన­బుల్‌ ట్రాన్స్‌పోర్టు చార్జీతో కలిపి ఏ నియోజ­క­వర్గంలో ఏ రేటుకు విక్రయించాలో ప్రజలందరికీ తెలిసేలా ప్రతి ఆదివారం పత్రికల ద్వారా ప్రచారం చేశాం. నిర్దేశించిన ధరకు ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని టోల్‌ ఫ్రీ నంబర్‌ ఇచ్చాం. తప్పు చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా అంటూ ప్రతి వారం పత్రికల్లో ప్రచారం చేశాం.

40 లక్షల టన్నుల ఇసుక కాజేశారు 
వర్షా కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడ­దన్న ముందు చూపుతో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేస్తే ఎన్నికల్లో ఆ యార్డుల వద్దకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ వెళ్లి సెల్ఫీలు దిగారు. ఇసుకగుట్టలు చూపించి లేనిపోని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడా ఇసుక గుట్టలు, కొండలు ఏమైపోయాయి? అధికారంలోకి వచ్చీ రాగానే ఏకంగా 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు మనుషులు ఎడాపెడా అమ్మేసు­కున్నారు. వాళ్లపై యాక్షన్‌ తీసుకునే ధైర్యం చంద్ర­బాబుకు ఉందా? 

ఈ రోజు ఉచిత ఇసుక అని చెప్పిన చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇచ్చిన రేటు కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. వైఎస్సార్‌సీపీ హయాంలో టన్నుకు రూ.375 చొప్పున ఏటా రూ.765 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తే నేడు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. అలాగని ఉచిత ఇసుక అమలవుతుందా.. అంటే అదీ లేదు. ఎడాపెడా దోచుకుంటున్నారు. ఇసుక రేట్లు చూస్తుంటే వైఎస్సార్‌సీపీ హయాంలోనే మేలు.. అప్పుడే రేట్లు తక్కువగా ఉన్నాయని ప్రజలు బాహా­టం­గానే చెబుతున్నారు. ఎక్కడా స్టాక్‌ లేదు. దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. కళ్లెదుట దోపిడీ కనిపిస్తుంటే వేరొకరిపై వేలెత్తి చూపిస్తున్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)