Breaking News

కంటనీరులే నింపకమ్మా.. సొమ్మసిల్లకే కూనలమ్మా!

Published on Tue, 06/10/2025 - 04:16

నాన్న చనిపోయాడు. అమ్మకు మానసిక వైకల్యం. నా అనే దిక్కులేదు. అమ్మకొచ్చే పెన్షన్‌తో బతుకీడుస్తూ, కష్టాల మధ్యే చదువుకుంటున్న తొమ్మిదో తరగతి బాలికపై టీడీపీ మూకల పైశాచికత్వం కోరలు చాచింది. వంతులేసుకుని మరీ నెలలు తరబడి కీచకపర్వం సాగింది. ఇప్పుడా బాలిక జీవితం అగమ్యగోచరంగా మారింది.

పద్నాలుగు మంది కామాంధుల కర్కశానికి బలైన ఈ చిన్నారిని చూస్తే దుఃఖం పొంగుకొస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకుల సామూహిక అత్యాచారానికి గురైన దళిత మైనర్‌ బాలిక 8 నెలల గర్భంతో అనంతపు­రంలోని సర్వజనాసుపత్రి­లో బేలచూపులతో మౌనంగా రోదిస్తోంది.   –సాక్షి ప్రతినిధి, అనంతపురం

వెలుగులోకి రాకపోయి ఉంటే పరిస్థితి ఏమిటి?
ఈ దారుణాన్ని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తీసుకురాకపోయి ఉంటే బాలిక పరిస్థితి ఎలా ఉండేదోనని చుట్టుపక్కల గ్రామస్తులు వాపోతున్నారు. ఊరు ఊరంతా టీడీపీ వర్గం కావడం.. ఏదైనా బయటకు చెబితే ప్రమాదం ఉండటంతో బాలిక ఎక్కడా నోరెత్తలేక­పోయింది. కరుణ చూపాల్సిన పెద్దమనుషులు సైతం నిందితులకు వత్తాసు పలుకుతూ బాలికకు అబార్షన్‌ చేయించాలని నిందితులను తప్పించాలని చూశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా అధికార పార్టీ నేతల జోక్యం అడుగడు­గునా అడ్డుగానే నిలిచింది. తమ వర్గం కాబట్టి నిందితులను తప్పించాలనే ఒత్తిడి పోలీసులపై పెరిగింది. పెద్ద సెక్షన్లు పెట్టొద్దని గట్టిగానే చెప్పారు. అప్పటికే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో వీరి ఆటలు సాగలేదు.

బాధితురాలి పరిస్థితి దయనీయం
బాధితురాలు 8 నెలల గర్భిణిగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో హిమోగ్లోబిన్‌ 6.3 శాతం మాత్రమే ఉన్నట్టు తేలింది. సాధారణ మహిళకు 10 శాతంపైనే ఉండాలి. గర్భిణికి 11.5కు పైగా ఉండాలి. అలాంటిది ఈ బాలికకు కేవలం 6.3 శాతం ఉండటంతో అదనపు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. జూలై 27వ తేదీలోగా ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 

బడికి వెళ్లాల్సిన వయసులో అత్యా­చా­రా­నికి గురై ఆస్పత్రిలో ప్రసవానికి రావడంతో ఆ బాలిక తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది.బా­లికను కనీసం ప్రత్యేక వార్డులో పెట్టి వైద్యం చేయడం లేదు. పోలీసులు అక్కడికి తెచ్చి వదిలేసి వె­ళ్లారు. ఇప్పుడేమో వా­ర్డు­లో అందరిలాగే ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు.  కాన్పు­కు వచ్చిన మిగతా మహిళల ముందు ఈ బాలికను చూడాలంటే­నే ద­యనీయంగా ఉంది. కనీసం ప్రత్యే­క వై­ద్య పరీక్షలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు.

సఖి సెంటర్‌కు తరలించాలన్న పోలీసులు
రామగిరి సీఐ ఆస్పత్రి సిబ్బందిని కలిసి బాలికను సఖి సెంటర్‌కు తరలించాలని అడిగినట్టు తెలిసింది. దీనికి వైద్యులు నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికకు వైద్యసేవలు చాలా అవసరమని, ఇప్పట్లో బాలికను సఖి సెంటర్‌కు తరలించడం మంచిది కాదని సూచించారు. ఆస్పత్రికి అయితే రోజూ వందల మంది వస్తుంటారు. మీడియా ప్రతినిధులూ వచ్చి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో బాలికపై సామూహిక అత్యాచార విషయంపై రోజూ చర్చ జరుగుతుందన్న కారణంగా పోలీసులు బాధితురాలిని సఖి సెంటర్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. 

అంధకారంలో బాలిక భవిష్యత్‌ 
బాధితురాలి భవిష్యత్‌ అంధకారంలో పడింది. కడుపులో పెరుగుతున్న బిడ్డను అబార్షన్‌ చేసి తీసేయలేమని ఇప్పటికే వైద్యులు తేల్చి చెప్పారు. కచ్చితంగా ప్రసవం చేయాల్సిందేని స్పష్టం చేశారు. ప్రసవం అయ్యాక తల్లీ బిడ్డ ఎ­లా బతకాలి? ఆ ఊర్లో ఉండగలరా? నిందితులకు శిక్ష ప­డ్డా­క  ఈ అమ్మాయిని ఆ ఊర్లోకి టీడీపీ నేతలు రాని­స్తా­రా? ఒకవేళ పోలీసు బందోబస్తు మధ్య అమ్మాయి ఊర్లోకి వెళ్లినా ఆమెను బతకనిస్తారా? ఇవన్నీ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరి నోట వినిపిస్తున్న ప్రశ్నలు.     

పరామర్శ లేదు.. ప్రభుత్వ సాయమూ లేదు 
ఈ అభాగ్యురాలి విషయం వెలుగులోకి వచ్చి నాలుగు రోజులు దాటినా ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించలే­దు. కనీసం రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత బాధితురాలిని పరామర్శించిన పాపాన పోలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఈ దారుణాన్ని ఖండించలేకపోయారు. పరిటాల సునీత సొంత మండలం రామగిరి కావడం.. ఇక్కడ ఏం జరిగినా పోలీసులు సునీత కుటుంబానికి అండగా ఉండటం సాధారణమైపోయింది. నియోజకవర్గ పరిధిలో ఆరు నెలల్లోనే మూడు హత్యలు జరిగాయి. ఒక అత్యాచారమూ జరిగింది. వీట­న్నిటిలోనూ సునీత వర్గీయులే నిందితులుగా ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)