Breaking News

రుషికొండ బీచ్‌లో విషాదం

Published on Mon, 02/16/2026 - 04:29

కొమ్మాది (విశాఖ): మహాశివరాత్రి పర్వదినాన్ని ఆనందంగా గడపాలని సంద్రానికి వెళ్లిన స్నేహితులకు విషాదం మిగిలింది. అలల తాకిడికి కొట్టుకుపోయి బీటెక్‌ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. కొమ్మాది గాయత్రీ విద్యాపరిషత్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం  రుషికొండ బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ స్నానాలు ముగించుకుని రాడిసన్‌ బ్లూ వెనుక వైపు ఉన్న తీరానికి వెళ్లారు.

అరవింద్‌ నాయుడు (21) మళ్లీ సముద్రంలోకి దిగగా, అలల ఉధృతికి ఒక్కసా­రిగా కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో స్నేహితుడు గోకులకృష్ణ  ప్రమా­దంలో చిక్కుకున్నాడు. గమనించిన లైఫ్‌ గార్డ్స్‌ బోటులో వెళ్లి గోకుల కృష్ణను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అపస్మారక స్థితిలో ఉన్న అరవింద్‌కు సీపీఆర్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరవింద్‌ మృతి చెందాడు. అరవింద్‌ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామం. అతని తండ్రి సూర్యప్రకాష్‌ ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసునమోదు చేశారు.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)