Breaking News

బడుగులేరు ఎస్సీ కాలనీలో విష జ్వరాలు, కామెర్లు

Published on Fri, 11/07/2025 - 04:33

కనిగిరి రూరల్‌: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బడుగులేరు ఎస్సీ కాలనీకి చెందిన 9 మంది విద్యార్థులు వాంతులు, విష జ్వరాలు, కామెర్లతో కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో చేరటంతో ఒక్కసారిగా ఆందో­ళన రేగింది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకా­రం.. గ్రామంలోని జెడ్పీఉన్నత పాఠశాలలో సుమారు 220 మంది చదువుతున్నారు. వారందరికీ మోంథా తుపాను కారుణంగా సెలవులు ఇవ్వ­గా.. ఎస్సీ కాలనీలో నాలుగు కుటుంబాలకు చెందిన సుమారు 13 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, జ్వరాలతో అనారోగ్యం పాలయ్యా­రు. స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నారు. 

వీరిలో ముగ్గురు కోలుకోగా, మిగతా 9 మందికి వాంతులు తగ్గినా జ్వరం తగ్గలేదు. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) సూచన మేరకు విద్యార్థుల్ని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి బుధ­వారం తరలించారు. వైద్య పరీక్షలు చేయగా, కామెర్లుగా నిర్ధారణ అయింది. ఒకే ఇంట్లోని బ్లెస్సీ, రేచర్ల (9, 8 తరగతులు), మరో ఇంట్లోని అజయ్‌ (10వ తరగతి), ఒకే ఇంట్లోని తరుణ్, జయకుమార్, రాణి (3, 8, 10 తరగతులు), ఇంకో ఇంట్లో­ని కొండ్రు జగన్‌ (4వ తరగతి) కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

విక్కి (7వ తరగతి) ఒంగోలులో, షర్లీ (8వ తరగతి) చెన్నైలో చికిత్స పొందుతున్నట్టు వారి తల్లిదండ్రులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం పాఠశాలలోని 9, 10 తరగతుల విద్యార్థినులు ముగ్గురు కామెర్లకు గురైనట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్బయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. డీఈఓ, డీఎంహెచ్‌ఓ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు,  ప్రజాప్రతినిధులు బడుగులేరు పాఠశాలను సందర్శించారు. గ్రామంలోని మూడు బోర్ల వద్ద, గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు.   

నాలుగు రోజుల క్రితం ఓ విద్యార్థి మృతి  
కాగా.. బడుగులేరు ఎస్సీ కాలనీకే చెందిన 2వ తరగతి విద్యార్థి బి.భరత్‌ ఈ నెల 2న మృతి చెందాడు. కడుపులోని పేగుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా చనిపోయినట్టు అతని తండ్రి బలసాని రాజశేఖర్‌ తెలిపారు. ఇప్పుడు మరికొందరు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో విద్యాశాఖ అధికారులు వచ్చి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. రెండేళ్ల నుంచి విద్యార్థి భరత్‌కు కడుపులో నొప్పి వస్తోందని అతని తల్లిదండ్రులు చెప్పారని డీఈఓ కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. దీనికి, తాజా ఘటనకు సంబంధం లేదన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)