Breaking News

రుతుపవనాల్లో కదలిక

Published on Wed, 05/31/2023 - 03:59

సాక్షి, విశాఖ­పట్నం: నైరుతి రుతు­­పవ­నాల్లో ఎట్టకే­లకు కద­­లిక వస్తోంది. వారం రోజుల కిందట ఈ రుతుపవనాలు అండమాన్‌ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి సకాలంలోనే ప్రవేశించాయి. తర్వాత అవి ఊహించిన దానికంటే నెమ్మ­దిగా కదు­లుతున్నాయి. గురువారం నుంచి అవి చురుకు­దనాన్ని సంతరించుకోనున్నాయి.

ఒకటి, రెండు­­రోజుల్లో ఈ రుతుపవనాలు మాల్దీ­వులు, కొమరిన్‌ ప్రాంతాలతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతాల్లోని కొన్ని ప్రాంతాలకు, అనంతరం మధ్య, ఆగ్నేయ బంగాళా­ఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థి­తులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతా­వరణశాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి వెల్లడించింది. ఐఎండీ ముందుగా అంచనా వేసినట్టుగా జూన్‌ 4వ తేదీకల్లా నైరుతి రుతుపవ­నాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు మెరుగుపడ్డా­యని వాతా­వరణ నిపుణులు చెబుతున్నారు.

మరో­వైపు పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మర­ఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొన­సాగు­తోంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో­స్ఫిరిక్‌ స్థాయిలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తు­న్నాయి. ఫలితంగా రానున్న మూడు­రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

బుధ­వారం కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కా­రం ఉందని పేర్కొంది. రానున్న మూడు­రో­జులు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదు­రు­గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి, రెండుచోట్ల పిడుగులు పడొచ్చని వివరించింది.  
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)