Breaking News

తిరుపతికి ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు

Published on Fri, 10/03/2025 - 14:05

సాక్షి, తిరుపతి: తిరుపతిలోని పలు ప్రాంతాల్లో బాంబు  బెదిరింపు ఈ-మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. ‘హోలీ ఇస్లామిక్‌ ఫ్రైడే బ్లాస్ట్స్‌’ పేరిట మెయిల్స్‌ వచ్చాయి. ఉగ్రవాదుల బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేపట్టాయి. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్‌, విష్ణు నివాసం ప్రాంతాల వద్ద ప్రత్యేక బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు.

వివిధ రాష్ట్రాలలో బాంబులు పెట్టినట్లు కొన్ని ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయి. తిరుపతి జిల్లాకి కూడా ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో, జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికావొద్దని ఎస్పీ  తెలిపారు.

తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నివాసం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి భవనం, సినీనటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. తమిళనాడులోని పలు రాజకీయ, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో.. తిరుపతిలోని పోలీసు ప్రత్యేక విభాగం అలర్ట్‌ అయ్యింది.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)