Breaking News

ఆగమోక్తంగానే స్వామివారి కైంకర్యాలు

Published on Fri, 02/23/2024 - 04:22

తిరుమల: తిరుమలలో శ్రీవారి కైంకర్యాలు అన్నీ ఆగమోక్తంగానే నిర్వహిస్తున్నామని తిరుమల శ్రీ వారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు చెప్పారు. తిరుమలలోని అర్చక నిలయంలో ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు గురువారం మీడియాతో మా ట్లాడుతూ.. టీటీడీ పరిపాలన, అధికారులు, స్వామి వారి ఆలయంపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను అర్చకులందరం ఖండిస్తున్నామని అన్నారు.

శ్రీవారి ఆలయంలో క్రమం తప్పకుండా అన్ని కైంకర్యాలు ఆగమోక్తంగానే జరుగుతు న్నాయని స్పష్టం చేశారు. పరిపాలన అంశాలు, అధికారులపై రమణ దీక్షితులు మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వచ్చిందన్నారు. శ్రీవారి ఆల యంలోకి స్తంభాలు తీసుకువచ్చారని, తవ్వకాలు జరిగాయంటూ ఆ వీడియోలో రమణ దీక్షితు లు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చెప్పారు. ఆ గమ సలహాదారులు, ప్రధాన అర్చకుల సూచనల మేర కు ఆలయంలో కైంకర్యాలన్నీ యథావిధిగా జరు గుతున్నాయని అన్నారు.

రమణ దీక్షితులు ఆగమ సలహా మండలి సభ్యుడుగా, ప్రధాన అర్చకులుగా ఉన్న సమయంలోనే ఆలయంలోని తిరుమలరా య మండపం, రంగ మండపం ప్రాంతాల్లో కుంగిపోయిన పైకప్పు, బలహీన పడిన స్తంభాలను పటిష్టపరిచారన్నారు. కొత్తగా ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలూ జరగలేదన్నారు. వంశపారంపర్యంగా సేవ చేసుకునే కుటుంబానికి చెందిన రమణ దీక్షితులు ఆలయ ప్రతిష్ట, వ్యవస్థపై అవాస్తవాలు మాట్లాడటం బాధాకరమని అన్నారు.

అవాస్తవాలు నమ్మకండి
భక్తులు ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని, రమణ దీక్షితులు వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. రమణ దీక్షితులను ముఖ్యమంత్రి గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినప్పటికీ, నాలు గేళ్లుగా ఆయన గుడికే రాలేదని, ప్రతి నెలా రూ.80 వేల జీతాన్ని మాత్రం తీసుకుంటున్నారని తెలి పారు. రమణ దీక్షితులు, ఆయన కుమారుడు కూడా ఆలయానికి రావడంలేదని తెలి పారు. ఏడాదిలో రెండు మూడుసార్లు వచ్చి రెన్యువల్‌ చేసుకుని స్వామి కైంకర్యాల్లో పాల్గొనకుండా ఎక్కడో తిరుగుతున్నారని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రెండో కుమారుడు కూడా అర్చక త్వాన్ని విడిచిపెట్టారన్నారు. లుంగీలు, టీ షర్టులు ధరించిన అందరూ క్రిస్టియన్లు కారని అ న్నారు. లుంగీలు, టీషర్టులు ధరించిన ధర్మారెడ్డి క్రిస్టియన్‌ అని చెప్పిన రమణ దీక్షితులు కూడా ఆ వీడియోలో టీ షర్టు ధరించి ఉన్నారని తెలిపారు.

కైంకర్యంలో అధికారుల జోక్యం లేదు
స్వామివారికి నిర్వహించే  కైంకర్యాల విషయంలో టీటీడీ చైర్మన్, ఈవో, ఆలయ సిబ్బంది ఎట్టి పరి స్థితుల్లోనూ జోక్యం చేసుకోరని ఆలయ మరో ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు తెలిపా రు. ఆలయ వ్యవస్థపై, అధికారులపై తీవ్రస్థాయిలో ఆరోపించిన రమణ దీక్షితులే కొద్ది సమయంలోనే వీడియోలో ఉన్నది తన వాయిస్‌ కాదంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)