Breaking News

TTD : తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే

Published on Thu, 09/26/2024 - 07:37

తిరుపతి, సాక్షి: తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది .  ఉచిత సర్వ దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 2 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(బుధవారం) 77,939  మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 22,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.50 కోట్లుగా లెక్క తేలింది.

కల్పవృక్ష వాహనంపై గణనాథుడు
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో ప్రత్యేక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం విశేషపూజలు అందుకున్న శ్రీసిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ, మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, పంబ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఊరేగింపు అట్టహాసంగా సాగింది. ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ముందుగా వేకువజామున ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి అలంకార మండపంలో శ్రీసిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తికి ప్రత్యేక అభిషేకం చేశారు. పట్టుపీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో అలంకరించి కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఊరేగింపు ప్రారంభమైంది. భక్తులు కనులారా స్వామివారి సేవను తిలకించారు.

నేడు పూలంగిసేవ..
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారికి గురువారం పూలంగిసేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ గురుప్రసాద్‌ తెలిపారు. ఉదయం అభిషేకం, రాత్రి పూలంగిసేవ జరుగుతుందన్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)