Breaking News

తిరుమలకు విపరీతంగా పెరిగిన రద్దీ

Published on Mon, 09/11/2023 - 07:59

సాక్షి, తిరుపతి: తిరుమలకు విపరీతంగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసం ముగుస్తుండడంతో.. భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) కోసం 18 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. 

ఇక.. నిన్న(ఆదివారం, 10) శ్రీవారిని 84,449 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,570గా ఉంది.  ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4.47 కోట్లుగా లెక్క తేలింది. 

రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.  బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ శుద్ధి చెయ్యనున్నారు అర్చకులు. ఈ నెల18 నుండి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 17న అంకురార్పణ, 18 ధ్వజారోహణం నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంతత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 


ఈ నెల 22వ తేదీన గరుడ సేవ ఉండగా.. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల్ని అనుమతించరు. ఇక బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  సిఫారసు లేఖలు రద్దు ఉంటుందని తెలియజేసింది టీటీడీ. అలాగే.. వాహనసేవలు తిలకించడానికి గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)