Breaking News

తిరుమల పవిత్రతను కాపాడేది ఇలాగేనా!

Published on Thu, 09/11/2025 - 08:01

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రీవారి ఆలయంలో అనేక అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం గ్రిల్‌ గేట్‌వద్ద టీవీ–5 ఉద్యోగి శ్యామ్‌నాయుడు చిల్లర వేషాలు వేశారు. ‘అంతా విష్ణుమాయ’ అంటూ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయానికి తాను తాళాలు వేస్తున్న ఫొటో, వీడియో శ్యామ్‌నాయుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

కాగా, తానేదో టీటీడీ ఉద్యోగస్తుడైనట్టు.. టీటీడీకి బీఆర్‌ నాయుడే రాజుగా వ్యవహరిస్తున్నట్టున్న వారి ప్రవర్తనపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ఇదేం పనులు అంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటమేమిటని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి ఆలయ మహా­ద్వారం గ్రిల్‌ గేట్‌ తాళాలు టీవీ–5 రిపోర్టర్‌ చేతికి ఎలా వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీవీ–5 చైర్మన్‌ బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత తిరుమల కొండపై టీవీ–5 సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల కొండపై రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేస్తున్న టీటీడీ అధికారులు తాజా ఘటనపై నోరెత్తకపోవడం కూడా చర్చనీయాంశమైంది. కేవలం టీవీ–5 ఉద్యోగి కావడం వల్లే శ్యామ్‌నాయుడుపై కేసు నమోదు చేయలేదని, ఇంత పెద్ద తప్పు చేసినా బీఆర్‌ నాయుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంపై భక్తులు మండిపడుతున్నారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)