Breaking News

సామాన్య భక్తులను పట్టించుకోరా?

Published on Tue, 09/17/2024 - 05:06

తిరుమల: తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదని.. ఆదివారం నుంచి క్యూలైన్‌లో వేచి ఉన్నా శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదంటూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై తమిళనాడుకు చెందిన బుల్లితెర నటుడు మహేశ్‌తో పాటు పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమ­వారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకు­న్న అనంతరం ఆనం మీడి­యాతో మాట్లాడుతుండగా.. ఆయన్ని ఆలయ అధికారి అని భావించిన తమిళనాడు భక్తులు చుట్టుముట్టేశారు. వీరిలో తమిళ నటుడు మహేశ్‌బాబు కూడా ఉన్నారు.

ఆయన మాట్లాడుతూ.. 10 మంది కుటుంబసభ్యు­లతో కలిసి ఆదివారం తిరుమలకు చేరుకు­న్నట్లు చెప్పారు. ఆదివారం క్యూ లైన్‌లోకి వెళ్లినా స్వామివారి దర్శన భాగ్యం మాత్రం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేయట్లేదని మరికొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నప్రసాదం, పాలు, మజ్జిగ ఇవ్వకపోవడంతో.. చిన్న పిల్లల­తో క్యూ లైన్లలో ఉండలేక బయటకు వచ్చేశా­మంటూ వాపోయారు. తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదంటూ మరో భక్తుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆనం స్పందిస్తూ.. అధికారుల ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తానంటూ సర్దిచెప్పి.. అక్కడి నుంచి జారుకున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)