Breaking News

బ్రహ్మోత్సవాలలో ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు

Published on Thu, 11/20/2025 - 21:32

తిరుపతి, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో టిటిడి చేపట్టిన విద్యుత్ అంలకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుచానూరు పరిసర ప్రాంతాలలో, తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయి. బ్రహ్మోత్సవాల రాత్రుల సమయాలలో పండుగ వాతావరణాన్ని మరిపిస్తున్నాయి.

శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చిన్న, పెద్ద, మధ్య తరహా అమ్మవారి, స్వామి ప్రతిమలు దాదాపు 112కు పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ పనులు చేపట్టారు. ఈ సారి కొత్తగా  తిరుచానూరు ఆస్థాన మండపం వద్ద అమ్మవారి ఆభరణాలు, ఆస్థాన మండపం ఎదురుగా అభిషేక లక్ష్మీ 3 డి విద్యుత్ ప్రతిమలను, పుష్కరిణి దక్షిణం వైపున గజ వాహనం, పుష్కరిణి తూర్పు వైపు త్రిముఖం, ఫ్లైఓవర్ సమీపంలో గోపురం లక్ష్మీ, తలుపుల మహా విష్ణు రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పుష్కరిణి చుట్టూ 8 అష్ట లక్ష్మీ విద్యుత్ విగ్రహాలు, అన్నదానం సమీపంలో ధన లక్ష్మీ, పూడి సమీపంలో రాధాకృష్ణ, మార్కెట్ యార్డ్ వద్ద గడప లక్ష్మీ, అదేవిధంగా తిరుచానూరు పరిసర ప్రాంతాలలో మహా విష్ణు, గరుడ వాహనంపై స్వామి వారు, అమ్మవారు, కలశ లక్ష్మీ,   విష్ణువు, లక్ష్మీ, అయోథ్య రాముడు, అష్ట లక్ష్మీలతో మహా విష్ణువు, విశ్వరూపం, అష్ట లక్ష్మీలు, లక్ష్మీ, సరస్వతి, వినాయకుడు, దశ విగ్రహాలు, ఎల్.ఈ.డి తోరణాలు, ఎల్.ఈ.డితో డిజైన్ చేసిన ఆర్చ్ లను ఏర్పాటు చేశారు. పద్మ సరోవరం లోపలి భాగంలో నాలుగు వైపులా జలపాతం ప్రవాహం వస్తున్నట్లు విద్యుత్ కాంతులు అదనపు ఆకర్షణ.



తిరుచానూరు పరిసరాలు రాత్రుల సమయాలలో  రజతంలా మెరిసిపోతున్నాయి. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక శోభను అందిస్తూ, భక్తుల హృదయాలను ఆకర్షిస్తున్నాయి. తిరుచానూరు అంతటా విద్యుత్ కాంతుల వెలుగులు భక్తులను మంత్ర  ముగ్ధులను చేస్తున్నాయి.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)