Breaking News

∙రాత్రంతా చెట్టుపైనే..

Published on Tue, 07/30/2024 - 05:14

చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):   తెలంగాణ నుంచి ఒడిశా వెళుతోన్న టిప్పర్‌ వరదనీటిలో చిక్కుకోగా డ్రైవర్‌ రాత్రంతా చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో జరిగింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన మర్రి నవీన్‌ తెలంగాణలోని సత్తుపల్లికి చెందిన టిప్పర్‌ను ఒడిశాలో అప్పగించేందుకు ఆదివారం బయలుదేరాడు. 

గూగుల్‌ మ్యాప్‌ సాయంతో టిప్పర్‌ను నడుపుతున్న నవీన్‌ అర్ధరాత్రి చింతూరు మండలం నిమ్మలగూడెంకు చేరుకున్నాడు. అప్పటికే ఒడిశాకు వెళ్లే జాతీయ రహదారి–326పై భారీగా వరదనీరు నిలిచి ఉంది. ఈ విషయాన్ని గమనించని నవీన్‌ వేగంగా టిప్పర్‌ను నీటిలోకి దింపడంతో అది దూసుకుపోయి వరద నీటిలో చిక్కుకుంది. 

దీంతో భయపడిన అతను లారీ క్యాబిన్‌పైకి ఎక్కగా వరదనీరు క్రమేపీ క్యాబిన్‌ పైకి కూడా రావడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు పక్కనే ఉన్న తాటిచెట్టు ఎక్కాడు. రాత్రంతా అతను చెట్టుపైనే బిక్కుబిక్కుమంటూ గడపగా ఉదయం అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని పడవ సాయంతో డ్రైవర్‌ను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)