Breaking News

ఈసారీ బ్యాంకు ఖాతాల్లోనే పింఛను డబ్బులు

Published on Thu, 05/30/2024 - 05:25

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అవ్వాతాతలకు వచ్చే నెల నుంచి పంపిణీ చేసే పింఛన్‌ను కూడా ప్రభు­త్వం లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. మే నెలలో ఇంటివద్ద పింఛను పొందిన వారికి ఈసారి కూడా 1–5 తేదీల మధ్య ఇంటివద్దే ఆ డబ్బు అందిస్తారు. జూన్‌ ఒకటికి కొత్తగా 80 ఏళ్లు వచ్చిన వారికి కూడా ఇంటి వద్దే పింఛన్‌ డబ్బు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ బుధవా­రం మార్గదర్శకాలు జారీ చేశారు. 

ఐదేళ్లుగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీనే ఠంచన్‌గా పింఛన్‌ లబ్ధిదారులందరికీ వలంటీర్ల ద్వారా ఇంటివద్దే అందించేది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేప«థ్యంలో ఎన్నికల కోడ్‌ పేరుతో టీడీపీ చేసిన ఫిర్యాదులతో వలంటీర్లను ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉంచింది. దీంతో రెండు నెలలుగా అవ్వాతాతలు, దివ్యాంగులు, తది­త­రు­లకు అందించే పింఛన్ల పంపిణీలో మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. పింఛన్లను లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌చైర్‌లకు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం ఇంటి వద్దనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో పింఛను డబ్బులను పంపిణీ జరిగింది. జూన్‌ నెలలోనూ ఇదేవిధంగా జరగనుంది. 

73% లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ 
రాష్ట్రవ్యాప్తంగా 65,30,808 మందికి పింఛన్లు పంపిణీ చేస్తారు. ఇందుకోసం రూ.1,939.35 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. లబి్ధదారుల్లో 47,74,733 మంది (73.11 శాతం)కి డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లో ఒకటో తేదీనే జమ చేస్తారు. మిగిలిన 17,56,105 మంది (26.89 శాతం)కి ఇంటి వద్దే పంపిణీ చేయనున్నారు. 

ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పెన్షన్‌ పంపిణీ చేయాలని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇతర రాష్ట్రాల కోఆపరేటివ్‌ బ్యాంకులలో బ్యాంకు ఖాతా ఉన్న లబ్దిదారులకు కూడా డీబీటీ రూపంలో కాకుండా జూన్‌ 1 – 5 తేదీల మధ్య ఇంటి వద్దనే పంపిణీ చేస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)