వైఎస్సార్, అల్లూరి జిల్లాల్లో పులుల సంచారం

Published on Wed, 12/04/2024 - 05:30

లింగాల/రాజవొమ్మంగి/అడ్డతీగల: వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో పులి, పులి పిల్లలు సంచరిస్తున్న దృశ్యాలను రైతులు చంద్రశేఖర్, తన చెల్లెలు తమ సెల్‌ఫోన్‌ల్లో సోమవారం వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికా­రులు తాతిరెడ్డిపల్లె గ్రామానికి చేరుకుని పులులు సంచరిస్తోన్న ప్రదేశాలను తనిఖీలు చేశారు. అయితే సోమవారం రాత్రి వర్షం కురవడంవల్ల వాటి జాడలు కనిపించలేదు. 

గ్రామస్తులకు తహశీల్దార్‌ ఈశ్వరయ్య తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు పొలం పనులు పూర్తి చేసుకుని రావాలని రైతులకు, చీకటి పడేలోపు ఇళ్లకు చేరుకోవాలని గొర్రెల కాపరులకు సూచించారు. పులుల సంచారంపై నిఘా ఏర్పాటు చేస్తామని డీఆర్‌వో శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల సరిహద్దుల్లో ఈ పులులు సంచరిస్తున్నట్లు చెప్పారు. 

ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటి సంచారాన్ని పసిగట్టి వాటిని అక్కడ నుంచి తరిమివేసేలా చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో దివాకర్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం డీఆర్‌వో శ్రీనివాసులు, ఎఫ్‌బీవోలు మహబూబ్‌ బాషా, గోపాల్‌ పులులు సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు.

అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి నుంచి గొబ్బిలమడుగు వెళ్లే ఘాట్‌రోడ్‌/­అటవీప్రాంతంలో పులి సంచారంపై మంగళవారం సాక్షిలో ‘అమ్మో పులి’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా రాజవొమ్మంగి అటవీక్షేత్రాధికారి జి.ఉషారాణి ఘటనాస్థలికి వెళ్లి పులి పాదముద్రలు పరిశీలించారు. పాద ముద్ర 14 సెం.మీ. పొడవు, వెడల్పు ఉన్నట్లు రికార్డు చేశారు. 

లోతట్టు అటవీ ప్రాంతంలోకి వెళ్లి సెలయేరు వద్ద పులి సంచరించిన చోట పరిశీలించగా అక్కడ పులి అడుగు జాడలు కనిపించడంతో ఫోటోలు తీశారు. ఇది పులా? చిరుత పులా? అనే సమాచారాన్ని అధికారులతో సంప్రదించి వెల్లడిస్తామన్నారు.

పులి దాడిలో మేకలు చనిపోయిన ఘటనపై విచారణ కోసం మేకల కాపరి ఉండే అడ్డతీగల అటవీ సబ్‌ డివిజన్‌ పాపంపేట సెక్షన్‌ పరిధి కినపర్తికి అడ్డతీగల సబ్‌ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది వెళ్లారు. పులిని చూసిన మేకల కాపర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. మేకలపై దాడి సమయంలో చెట్లెక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నట్లు వారు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)