Breaking News

హైవేపై పెద్దపులిని ఢీకొన్న కారు

Published on Tue, 06/18/2024 - 03:57

మర్రిపాడు/ఆత్మకూరు రూరల్‌: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలో నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపైకి ఒక్కసారిగా పెద్దపులి రావడం కలకలం రేగింది. ఆ పులిని ఓ కారు ఢీకొనడం.. ఆగ్రహంతో పెద్దపులి తిరిగి ఆ కారుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఆకస్మిక ఘటనతో కారులో ప్రయాణిస్తున్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బద్వేల్‌ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఓ కారుకు కదిరినాయుడుపల్లి సమీపంలో వెలిగొండ అటవీ ప్రాంతం వద్ద ఒక్కసారిగా పెద్దపులి అడ్డువచ్చింది.

పెద్దపులిని కారు ఢీకొని కొద్దిదూరం ముందుకు దూసుకువెళ్లింది. దీంతో పెద్దపులికి కోపం వచ్చి వాహనం ముందు భాగంపై తన పంజాతో దాడి చేసింది. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కారు డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో లోపల ఉన్నవారికి  ప్రమాదం తప్పింది. కారు ముందుభాగం ధ్వంసమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.

పెద్దపులి కాలి ముద్రలు, కారు ఢీకొనడం వల్ల పులి గాయపడినట్లుగా ఆనవాలు కనుగొని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు కదిరినాయుడుపల్లి సమీపంలోని అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దపులి సంచారంతో కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతం సమీపంలోని పడమటినాయుడుపల్లి, చుంచులూరు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

శేషాచలం చేరిన పెద్దపులి!
శ్రీశైలం–శేషాచలం మధ్య పెద్దపులుల కారిడార్‌ ఉంది. శ్రీశైలం–నాగార్జున సాగర్‌ అభయారణ్యం నుంచి శేషాచలం వరకు పులుల విస్తరణ కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. అయితే, శేషాచలం వరకు పెద్దపులి వెళ్లిందా.. లేదా.. అని ఇప్పటికీ సంశయంగానే ఉండేది. ఆ అనుమానాలకు తెరదించుతూ శేషాచలం అటవీ ప్రాంతం వరకు పెద్దపులి చేరిందని కదిరి నాయునిపల్లె సమీపంలో సోమవారం జరిగిన ఘటనతో స్పష్టమైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)