Breaking News

పులుల ఎన్‌క్లోజర్‌ పనులకు ఆదిలోనే హంసపాదు!

Published on Fri, 06/20/2025 - 04:07

పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో పెరుగుతున్న పులి పిల్లలను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో ఉంచి సంరక్షించాలన్న అధికారుల లక్ష్యం నెరవేరకుండా పోయింది. తల్లి నుంచి విడిపోయి వేటాడటం తెలియని పులి పిల్లలకు వేట నేర్పేందుకు నల్లమల అభయారణ్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ టైగర్‌ ఎన్‌క్లోజర్‌ పనులకు ఉన్నతాధికారుల బదిలీలతో పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడింది. దాదాపు రెండేళ్ల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో స్థానికుల కంటపడ్డాయి. 

ఈ క్రమంలో అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీశాఖ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రెండేళ్ల క్రితం అధికారులు ప్రకాశం జిల్లా నెక్కంటి రేంజ్‌లో పెద్దపెంట, ఆరపెంట, గంగారంపెంట, పెద్దదోర్నాల మండలంలోని తెట్టుగూడెంల పరిధిలో దాదాపు రూ.2 కోట్లతో టైగర్‌ ఎన్‌క్లోజర్‌తో పాటు నర్సరీ, హెర్బివోస్‌ల(జింకలు, దుప్పులు) ఎన్‌క్లోజర్‌ పనులు చేపట్టారు.

సొంతంగా వేటాడగలిగేలా.. 
మొదటగా నర్సరీ ఎన్‌క్లోజర్‌లతో ఉంచిన పులి పిల్లలను టైగర్‌ ఎన్‌క్లోజర్‌లలోకి మార్చి, వ్యక్తిగతంగా ఆహారం కోసం అవి 50 వన్యప్రాణులను సొంతంగా వేటాడగలిగినప్పుడే వాటిని అభయారణ్యంలోకి వదులుతారు. ఇందుకోసం ఆయా ఎన్‌క్లోజర్‌లలో రూ.2.50 లక్షలతో సోలార్‌ బోరుతో పాటు, ఎన్‌క్లోజర్‌లోకి పైప్‌లైన్‌ సదుపాయం, జింకల అవసరాలు తీర్చేందుకు సాసర్‌పిట్లు, సహజ సిద్ధంగా ఉండే నీటి గుంతలను సైతం ఏర్పాటు చేశారు. 

సాధారణంగా కొద్ది రోజుల పాటు వాటిని సంరక్షించి అనంతరం పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. వేటలో వాటి శక్తియుక్తులను గుర్తించి తదుపరి చర్యలను తీసుకుంటారు. అయితే ఇవేమీ జరగకుండానే టైగర్‌ ఎన్‌క్లోజర్‌ పనులు మందగించాయి. 

ఎన్‌క్లోజర్‌ పనులకు కొత్తగా టెండర్‌లను పిలుస్తున్నాం 
అధికారుల బదిలీలు, గతంలో భారీ వర్షాల కార­ణంగా పనులు కొంత మేర మందగించాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయితే పనులు చురుగ్గా జరిగే అవకాశం ఉంది. కొత్తపల్లి పులి పిల్లలు పెద్దవి కావటంతో వాటిని తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉంది. – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్‌ రేంజి అధికారి, కొర్రప్రోలు 

మందగించిన నిర్మాణ పనులు 
నల్లమల అభయారణ్య పరిధిలోని కొందరు ఉన్నతాధికారుల బదిలీలతో పాటు మరి కొన్ని కారణాలతో టైగర్‌ ఎన్‌క్లోజర్‌ పనులతో పాటు నర్సరీ, హెర్బివోస్‌ల ఎన్‌క్లోజర్‌ పనులు నిలిచిపోయాయి. దీంతో తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజ సిద్ధంగా వాటి ఆహారాన్ని అవే వేటాడగలిగేలా చేయటంతో పాటు, పెద్దపులులలో అనాథలు, తీవ్ర గాయాల పాలైన వాటిని ఇక్కడ నర్సరీ ఎన్‌క్లోజర్‌లలో పెట్టి సంరక్షించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం ఆదిలోనే హంసపాదుగా మారింది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)