Breaking News

రేపటి నుంచి పులుల గణన

Published on Tue, 12/31/2024 - 06:04

రాష్ట్రవ్యాప్తంగా జనవరి1 నుంచి 45 రోజులపాటు పులుల లెక్కింపు జరుగనుంది. నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వు ప్రాజెక్టు పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు అటవీశాఖ ప్రాంతాలతోపాటు పల్నాడు, తిరుపతి, రాజంపేట, కడప అటవీ ప్రాంతాల్లో ఉన్న పులుల సంఖ్యను లెక్కించనున్నారు. ఇందుకోసం ప్రతి 2 చదరపు మీటర్లకు రెండు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఏకైక టైగర్‌ రిజర్వు ఫారెస్టు అయిన నాగార్జు­న­సాగర్, శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్టు సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. పులుల గణన కోసం సుమారు 2.15 లక్షల ఎకరాల్లో 400పైగా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో 86 నుంచి 88 వరకూ పులులు సంచరిస్తున్నట్లు అంచనా.             – మార్కాపురం

 బేస్‌ క్యాంపులు..
ప్రస్తుతం నల్లమలలో గంజివారిపల్లి సమీపంలోని పెద్దన్న బేస్‌ క్యాంపు, పాలుట్ల, వెదురుపడియ, నారుతడికల, ఇష్టకామేశ్వరి, పాలుట్ల, దొరబైలు, తుమ్మలబైలు, చిన్నమంతనాల, రోళ్లపెంట, కొర్రపోలు, కొలుకుల తదితర ప్రాంతాల్లో బేస్‌ క్యాంపులున్నాయి. రాత్రి 9 దాటితే దోర్నాల శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో పెద్దపులుల సంచారం ఉన్నందున రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపేస్తున్నారు. 

 రాష్ట్రవ్యాప్తంగా పులుల గణన..
రాష్ట్రంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో జనవరి 1 నుంచి 45 రోజుల పాటు పులుల గణన జరుగుతుంది. ఇవి శేషాచలం బయోస్పియర్‌ రిజర్వులో కూడా సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులుల సంరక్షణలో లంకా మల్లేశ్వర వన్యప్రాణి అభ­యారణ్యం, పెంచల నరసింహ అభయా­రణ్యం, వెంకటేశ్వర జాతీయ ఉద్యా­నవనం, పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. – సందీప్‌కృపాకర్, అటవీశాఖ డెప్యూటీ డైరెక్టర్, మార్కాపురం

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య