Breaking News

అట్టహాసంగా టిడ్కో గృహ ప్రవేశాలు

Published on Thu, 05/25/2023 - 04:53

పొన్నూరు(చేబ్రోలు)/నరసరావుపేట : పేదల సొంతింటి కలను సీఎం జగన్‌ సాకారం చేస్తున్నారని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధి నిడుబ్రోలు ప్రాంతంలో బుధవారం టిడ్కో గృహ సముదాయాల ప్రారంబోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 21 ఎకరాల్లో నిర్మించిన 2,368 టిడ్కో గృహాల్లో మొదటి విడతగా 1,660 గృహాలను మంత్రి ప్రారంభించారు.

అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో మొదటి దశలో భాగంగా నిర్మించిన 500 టిడ్కో గృహాలనూ మంత్రి ప్రారంభించారు. లబ్దిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు, తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా నిడుబ్రోలులో జరిగిన సభకు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య అధ్యక్షత వహించారు. 

మంత్రి సురేష్‌ మాట్లాడుతూ పొన్నూరులో రూ.177 కోట్లతో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయంతో ఇక్కడ సుమారు 12 నుంచి 15 వేల జనాభాతో జగనన్న టౌన్‌ షిప్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం  వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

కిలారి రోశయ్య మాట్లాడుతూ  పేదలకు లక్షల విలువ చేసే సొంతింటిని అందించిన  సీఎం జగన్‌.. పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చిత్రపటానికి లబ్దిదారులు క్షీరాభిõÙకం చేశారు. టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిత్తూరు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం 
పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన కార్యక్రమంలో టిడ్కో గృహాల మీద ఏర్పాటు చేసిన సీఎం జగన్‌ కటౌట్‌కు మహిళలు పాలాభిషేకం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం చేపట్టామని.. అందులో ఈ రోజు 500 గృహ ప్రవేశాలు చేసినట్టు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లతో మౌలిక వసతులు కల్పించిందన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు గతంలో డిపాజిట్‌ చేసిన నగదులో రూ.25 వేలు తిరిగి చెల్లించనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)