Breaking News

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Published on Mon, 08/04/2025 - 04:20

మదనపల్లె సిటీ/ములకలచెరువు: ఆర్టీసీ బస్సు మోటార్‌బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన విషాద ఘటన ఇది. వీరు ముగ్గురు చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలు. అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం, వేపూరికోట పం­చా­యతీ, పెద్దపాలెం ఫ్లైఓవర్‌ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వేపూరికోట పంచాయతీ కూటగుళ్లోపల్లికి చెందిన వేమనారాయణ, శ్యామల కుమారుడు కె.తరుణ్‌ (24), చంద్రప్ప, నాగరత్నమ్మల కుమారుడు కె.వెంకటేష్‌ (20), ఓబులేసు, కవితమ్మల కుమారుడు కె.మనోజ్‌ (19) మోటార్‌బైక్‌పై ములకలచెరువుకు బయలుదేరారు. 

ఆ ఊరిలో ఉండే వెంకటేష్‌ మిత్రుడు స్నేహితుల దినోత్సవం కేక్‌ కట్‌ చేసుకుందామని పిలవడంతో ములకలచెరువు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో పెద్దపాలెం ఫ్లైవర్‌ వద్ద ములకలచెరువు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తరుణ్‌ బెంగుళూరులో సిగ్విలో డెలివరీ బాయ్‌గా, వెంకటేష్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు.

మనోజ్‌ కాలేజీలో చదువుకుంటున్నాడు. వీరు బెంగళూరులో రూము అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ముగ్గురు అవివాహితులు. స్వగ్రామానికి శనివారం వచ్చారు.  ప్రమాద విషయం తెలిసిన వెంటనే ములకలచెరువు ఎస్‌.ఐ నరసింహుడు, సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కూటగుల్లోపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)