Breaking News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Published on Fri, 01/31/2025 - 03:49

పెడన: కృష్ణా జిల్లాలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు విడిచాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆర్తమూరు దళితవాడకు చెందిన పాపవర్తి శాంతరాజు (26)తోపాటు బాపట్ల విజయచందర్‌ (40), పీతల అజయ్‌ (24) పెయింటింగ్‌ పని­కోసం గురువారం ఉదయం మచిలీపట్నం వెళ్లా­రు.

పని ముగించుకుని సాయంత్రం ముగ్గురూ బైక్‌­పై తిరుగు ప్రయాణమయ్యారు. పెడన సమీ­పంలోని పెడన– బంటుమిల్లి బైపాస్‌ రోడ్డులో వస్తుండగా మచిలీపట్నం వైపు వేగంగా వస్తున్న లారీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసేందుకు రాంగ్‌ రూట్‌లో వచ్చి, శాంతరాజు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దాదాపు వంద మీటర్ల దూ­రం బైక్‌ను ఈడ్చుకుపోయింది. విజయచందర్, శాంతరాజు, అజయ్‌ రోడ్డుపై పడిపోయారు. 

విజయచందర్, శాంతరాజు అక్కడిక్కడే చనిపోగా అజయ్‌ను  మచిలీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్‌ రాజా, పెడన సీఐ కె నాగేంద్రప్రసాద్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మచిలీపట్నం ప్రభుత్వా­స్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ పుప్పాల పవన్‌కుమార్‌­ను పోలీసులు అదుపులోకి తీసుకు­ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆ కుటుంబాలకు వారే ఆధారం
మృతులు పెయింటింగ్‌ పనులు చేసి రోజువారీ కూలీతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వీరు ముగ్గురి మృతితో ఆ కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. బాపట్ల విజయచందర్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. వీరు పది, ఎనిమిది, ఐదో తరగతి చదువుతున్నారు. 

ఆ కుటుంబానికి దిక్కు విజయచందరే. శాంతరాజుకు తండ్రి లేడు. అన్న, శాంతరాజు సంపాదిస్తూ ఆఖరి తమ్ముడ్ని చదివించుకుంటున్నారు. పీతల అజయ్‌కి కూడా తండ్రి లేడు. సోదరుడితో కలిసి పెయింటింగ్‌ పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)