Breaking News

జగన్‌ హయాం స్వర్ణ యుగమే.. చంద్రబాబుది శ్రమ దోపి‘డీయే’!

Published on Wed, 10/22/2025 - 05:51

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ టక్కుటమార విద్యను ఈ సారీ ఆయన వదులుకోలేదు. గత ఎన్నికల ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు ఇప్పుడు వారిని దీపావళి సాక్షిగా నిలువునా మోసగించారు. వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారంలోకి రాగానే డీఏలతోపాటు ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లిస్తానని చంద్రబాబు పదే పదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన 16 నెలలు తరువాత ఒక్క డీఏ మాత్రమే మంజూరు చేశారు. మూడు డీఏలను తొక్కిపెట్టారు. మంజూరు చేసిన డీఏనూ ఉద్యోగ విరమణ తర్వాత ఇస్తామంటూ ఎన్నడూ లేని వింత విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు.  

పీఆర్సీ, ఐఆర్‌ ఊసే లేదు  
ఎన్నికల ముందు మెరుగైన పీఆర్సీ, ఐఆర్‌ అంటూ కల్లబోల్లి మాటలు చెప్పిన చంద్రబాబు 16 నెలలైనా పీఆర్సీ అమలు చేయలేదు. పైగా గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్‌తో రాజీనామా చేయించారు. ఇప్పటి వరకు పీఆర్సీ కమిషనర్‌ను నియమించలేదు. రూ.34వేల కోట్ల పెండింగ్‌ బకాయిలు అతీగతీ లేవు.  ఆరు నెలల్లోనే ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ను గాడిలో పెడతానని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ ఇస్తామని, పోలీసులకు శని, ఆదివారాల్లో సెలవులు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. పైగా ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగ విరమణ చేశాక ఇస్తానంటూ తాజాగా జీవో జారీ చేశారు.    
జగన్‌ హయాంలో 27 శాతం ఐఆర్‌
వైఎస్‌ జగన్‌ తన హయాంలో ఉద్యోగులకు అడుగడుగునా అండగా నిలిచారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఏకంగా 11 డీఏలను మంజూరు చేశారు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ మంజూరు చేశారు. ఆ తరువాత పీఆర్సీ సిఫార్సులను అమలు చేశారు. రెండేళ్లపాటు కరోనా వెంటాడినా సరే ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)