Breaking News

బొలెరో బోల్తా పడి ముగ్గురు కూలీల దుర్మరణం

Published on Mon, 02/09/2026 - 05:39

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా నుంచి కర్ణాటకకు చింతకాయల కోత పనులకు వెళ్లిన కూలీల్లో ముగ్గురిని ప్రమాదం బలితీసుకుంది. బొలెరోలో వెళ్లినవారు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఆ వాహనం బోల్తాపడడంతో ఈ విషాదం నెలకొంది. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామంలోని పూలకుంట్లపల్లెకు చెందిన 15 మంది కూలీలు బొలెరో వాహనంలో కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద చింతకాయలు కోయడానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా శ్రీనివాసపురం వద్ద బ్రేక్‌ ఫెయిలవడంతో వాహనం అదు­పు­తప్పి బోల్తాపడింది.

ఈ  ప్రమాదంలో శ్రీనివాసులు (25), మునెప్ప (65) అక్కడికక్కడే మృతిచెందారు. 13 మంది తీవ్రంగా గాయ­పడ్డారు. వారిలో ఏడుగురిని వేర్వేరు వాహ­నాల్లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు చికి­త్స చేసేలోపే వెంకటమ్మ (60) మృతిచెందింది. ఆరుగురు మదనపల్లెలోను, మరో ఆరుగురు శ్రీనివాసపురంలో చికిత్స పొందుతున్నారు. కూలి పనులకు వెళ్లిన ముగ్గురు ప్రాణాలు కో ల్పోవడంతో పూలకుంట్లపల్లెలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై శ్రీనివాçసపురం పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 
సాక్షి, అమరావతి : కర్ణాటకలో జరి­గిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కూలీలు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక శ్రీనివాసపురం వద్ద జరి­గిన రోడ్డు ప్రమాదంలో అన్నమ­య్య జిల్లా మదనపల్లెకు చెందిన కూలీ­లు మరణించడం విషాదకరమ­న్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలి­యజేశారు. క్షతగాత్రులకు మెరు­గై­న వైద్యం అందించేలా చర్య­లు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)