Breaking News

అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకుంటారా?

Published on Thu, 07/18/2024 - 05:42

ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చె­న్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్‌ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళ­వారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్‌ పోలీసులపై ప్రతాపం చూపించారు. 

తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించు­కుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహ­నాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్‌ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు. 

రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగ­­బ­డ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మ­ల్ని సస్పెండ్‌ చేయించి, వీఆర్‌కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు. 

అసలు వారిని వదిలేసి డ్రైవర్‌పై కేసు
ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయి అధికారులపై పచ్చ మూక బహిరంగంగా బెదిరింపులకు దిగినా.. వారిపై చర్యలకు ఆదేశించడంలో విశాఖ పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం విశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇంత జరిగినా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చలానా నమోదు మినహా విశాఖ పోలీసులు పచ్చమూకపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 

ఇటీవలే త్రీటౌన్‌ పోలీస్‌  స్టేషన్‌ కానిస్టేబుల్‌పై దాడి జరిగిన ఘటన విశాఖ ప్రజలు మరువకముందే.. ట్రాఫిక్‌ పోలీసులపై తెలుగు తమ్ముళ్లు పూటుగా తాగి మద్దిలపాలెంలో బరితెగించిన ఘటన చోటుచేసుకోవడం విశాఖ వాసులతో పాటు పోలీసు వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారాన్ని వీడియో­లతో సహా ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నతాధికారులకు పంపినట్టు తెలుస్తోంది. 

అయినా ఉన్నతాధికారులు ఈ ఘటనపై చర్యలకు ఆదేశించకపోవడం చర్చకు దారితీసింది. తెలుగు తమ్ముళ్ల బరితెగింపు వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఎట్టకేలకు విశాఖ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బుధవారం రాత్రి కారు డ్రైవింగ్‌ చేస్తున్న టెక్కలికి చెందిన బొమ్మిలి మురళీపై కేసు నమోదు చేసి మమా.. అనిపించారు. ఈ గొడవకు కారకులైన ఢిల్లీశ్వరరావు తదితరులను పక్కన పెట్టి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం చర్చనీయాంశమైంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)