Breaking News

ఉరవకొండలో పచ్చమూకల ఉరుములు

Published on Fri, 09/27/2024 - 05:23

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలో అరాచకాలకు హద్దులేకుండా పో­తోంది. కాంట్రాక్టర్లు మొదలుకుని అధికారుల వరకూ అందరినీ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమకు తలవంచకపోతే ఇక్కడ పనిచేసుకోలే­రని నేరుగా హెచ్చరిస్తున్నారు. 

ఇలా కూటమి సర్కారు కొలువుదీరిన నాటినుంచి ఉరవకొండ­లో చోటామోటా నాయకులు, మండల స్థాయి లీడర్లు చెలరేగిపోతున్నారు. మాట వినకపోతే దౌర్జన్యాలకూ తెగబడుతున్నారు. తాజాగా.. ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి వస్తున్న బెదిరింపులు ఇ­ప్పు­డు నియోజకవర్గంలో  చర్చనీయాంశమవుతోంది.  

సెక్యూరిటీ ఏజెన్సీకి బెదిరింపులు 
గతంలో ఉరవకొండ నియోజకవర్గంలో అత్యధికంగా గాలిమరలు (విండ్‌మిల్స్‌) ఏర్పాటుచేశారు. వీటి భద్రతను  ఎస్‌ఐఎస్‌ సెక్యూరిటీ ఏజెన్సీ 100 మంది సిబ్బందితో పర్యవేక్షిస్తోంది. కానీ, ఈ సెక్యూరిటీ సిబ్బందిని తొలగించి తమ మనుషులను పెట్టుకోవాలని.. మాట వినకపోతే ఇక్కడ ఉండలేరంటూ ఉరవకొండకే చెందిన మంత్రి పయ్యావుల కేశవ్‌ మనుషులు ఏజెన్సీని బెదిరిస్తున్నారు. 

కొన్నిచోట్ల వీరు బరితెగించి సెక్యూరిటీ సిబ్బందిని బలవంతంగా బయటకు లాగి యూనిఫాం వేసుకుని విధుల్లో చేరారు. వీరి ఆగడాలు చూసి ఏమీచేయలేక అక్కడున్న కంపెనీ ఇంజనీర్లు నోరెత్తడంలేదు. ఈ క్రమంలోనే తాజాగా కొందరు టీడీపీ నేతలు ఉరవకొండకు సమీపంలోని నింబగల్లు విండ్‌మిల్‌ సబ్‌స్టేషన్‌లో గొడవకు దిగి కార్యాలయానికి తాళాలు వేసినట్లు తెలిసింది. 

ఆ తర్వాత వివాదం సద్దుమణగడంతో మళ్లీ తెరిచారు. ప్రస్తుతానికి అక్కడున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తొలగించి కొత్తవారిని పెట్టారు. మరోవైపు.. ఎస్‌ఐఎస్‌ సంస్థకు 2026 వరకూ కాంట్రాక్టు ఉంది. కానీ, తక్షణమే కాంట్రాక్టు వదిలివెళ్లాలని పచ్చమూకలు బెదిరిస్తున్నాయి.  

ముఖ్యమంత్రికి ఫిర్యాదు.. 
ఈ దౌర్జన్యాలు, బెదిరింపులపై సెక్యూరిటీ సంస్థ యాజమాన్యం ముఖ్యమంత్రి కార్యాలయానికి, విద్యాశాఖా మంత్రి లోకేశ్‌కూ ఫిర్యాదు చేసింది. తమ విధులకు ఆటంకాలు కల్పిస్తూ స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని..  నిజానికి.. తాము స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించామని, అయినా సరే వెళ్లిపోవాలని తమను ఒత్తిడి చేస్తున్నట్లు అందులో పేర్కొంది. కానీ, వీరి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా టీడీపీ నేతల బెదిరింపులూ కొనసాగుతున్నాయి.  

మంత్రి ఇలాకాలో తమ్ముళ్ల ఆగడాలు..
»  విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో నాగరాజు అనే వ్యక్తి ఎనిమిదెకరాలు మొక్కజొన్న పంట వేయగా టీడీపీ నేతలు ఆ భూమి మాదంటూ పంటను ధ్వంసం చేశారు.

»  ఇదే మండలం చీకలగురికి గ్రామంలో ఓబులేసు, చౌడమ్మ దంపతులు రెండున్నర ఎకరాల్లో కందిపంట వేశారు. ఈ భూమి కూడా తమదేనంటూ పంటను ధ్వంసం చేసి భూమిని ఆక్రమించుకున్నారు.

»మంత్రి పయ్యావుల కేశవ్‌ స్వగ్రామం కౌకుంట్లకు సమీపంలో టీడీపీ మండల స్థాయి లీడర్‌ జూదం నిర్వహిస్తున్నా పోలీసులు చూసీచూడకుండా వదిలేశారు.

» ఉరవకొండలో చౌకబియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. డీలర్ల సహకారంతో టీ­డీపీ లీడర్లు దందా సాగిస్తున్నారు.   

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు