Breaking News

ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమాకు అనర్హులు

Published on Wed, 12/04/2024 - 05:38

సాక్షి, అమరావతి: నిర్దేశించిన గడువులోగా ప్రీమియం చెల్లించకపోతే తాము సాగు చేసే పంటలకు బీమా పొందేందుకు రైతులు అర్హత కోల్పోతారని వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో ఈ ఏడాది నుంచి రైతులను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పంటల బీమా ప్రచార వారోత్సవాలను మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ డైరెక్టర్‌ సేనాపతి ఢిల్లీరావుతో కలిసి ప్రారంభించారు. 

ఇన్సూరెన్సు  కంపెనీలు తయారు చేసిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. మీడియాతో రాజశేఖర్‌ మాట్లాడుతూ..పంట రుణం పొందిన సందర్భంలో సంబంధిత బ్యాంక్‌ వారే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి నేరుగా చెల్లిస్తారని చెప్పారు. బీమా వద్దనుకుంటే ప్రీమియం తగ్గింపు నిలిపివేయాలని రాతపూర్వకంగా బ్యాంక్‌కు సమరి్పంచాలన్నారు. రుణం తీసుకోని రైతులు తమ వాటా ప్రీమియం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి సచివాలయాలు, పీఏసీఎస్‌లు, పోస్టాఫీస్‌లు, కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ (సీఎస్‌సీ)ల్లో నమోదు చేసుకోవాలన్నారు.

దళారీలను నమ్మి మోసపోవద్దనన్నారు. రబీ సీజన్‌కు సంబంధించి ఇతర పంటలకు ఈ నెల 15గానూ, వరికి 31 లోగా ప్రీమియం చెల్లించాలని, లేకుంటే బీమా పొందేందుకు ఏమాత్రం అవకాశం ఉండదన్నారు. స్వచ్ఛంద నమోదు పద్ధతిపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలకు కేటాయించిన ఇన్సూ్యరెన్స్‌ కంపెనీలు, ఆయా జిల్లాలో నోటిఫై చేసిన పంటల వివరాలు, పంటల వారీగా కట్టాల్సి­న ప్రీమియం శాతం, రైతులు చెల్లించాల్సిన వాటా, నమోదు చేయడానికి గడువు, తదితరాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. 

వ్యవసాయ శాఖ డైరక్టర్‌ ఢిల్లీరావు మాట్లాడుతూ ఖరీఫ్‌ పంటలకు 2శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు తమ వాటా ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూ రికార్డులు, సీసీఆర్సీలు పొందిన రైతు­ల డేటాను జాతీయ పంటల బీమా పోర్టల్‌తో అనుసంధానం చేశామన్నారు. 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)