Breaking News

వ్యక్తిని చంపి బూడిదైన ఇవ్వరా?: కన్నబాబు

Published on Mon, 06/22/2026 - 16:40

సాక్షి, కాకినాడ: ఒక వ్యక్తిని చంపి అతని బూడిదకూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. సాయికృష్ణ కేసుపై కాకినాడలో ఆయన ఈ రోజు ( సోమవారం) మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  రాష్ట్రంలో సొంత రాజ్యాంగం అమలు చేస్తోందని దుయ్యబట్టారు.

సాయికృష్ణ, క్రాంతికుమార్‌ మరణాలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఇటీవల జరిగిన ఐదుగురి హత్యలు పోలీసుల చేసిన హత్యలేనన్నారు. సాయికృష్ణపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఎమ్మెల్యే పంతం నానాజీ సంస్కార హీనంగా దిగజారి మాట్లాడుతున్నారన్నారు. పంతం నానాజీ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి పంతం నానాజీకి లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు.? కాపుల గురించి మాట్లాడిన నేతలపై నీచంగా మాట్లాడితే ఎ‍ట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని ఆవిషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతో భరోసా బాధితులు అధికంగా కాపు నేతలే ఉన్నారని ఈ అంశంలో కాపు నేతలంతా కలిసి మాట్లాడుకుంటే మీకొచ్చిన నొప్పేంటి అని ప్రశ్నించారు. కాపులకు జరుగుతున్న అన్యాయాల గురించి కూటమి నేతలు ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)