Breaking News

విధి నిర్వహణలో భాగంగా... జత్వానీని విచారించడం తప్పా?

Published on Sat, 12/14/2024 - 04:50

సాక్షి, అమరావతి: డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్‌ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్‌ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్‌ దేశ్‌పాండే వివరించారు. 

జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌ కుమార్‌ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు. 

విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు. చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచి్చన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు? 

జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు. అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి వాదనల నిమిత్తం విచారణను న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ ఈ నెల 19కి వాయిదా వేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)