Breaking News

యనమలకుదురు కొండపై గణపతి ఆలయాల్లో చోరీ

Published on Tue, 07/21/2026 - 05:29

పెనమలూరు: విజయవాడ యనమలకుదురు కొండపై గల రెండు గణపతి ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు కొండపై గల శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ గణపతి ఆలయంలో హుండీని పగులగొట్టి అందులో సొమ్మును చోరీ చేశారు. ఆదివారం రాత్రి ఆలయంలో పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత ప్రధాన ద్వారాలు మూసి తాళాలు వేశారు. దొంగ దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ గోడపై (ప్రాకారం) నుంచి ఆలయంలోకి దిగాడు.

శివాలయం పక్కనే ఉన్న శ్రీగణపతి ఆలయం హుండీ పగులగొట్టి అందులో సొమ్ము చోరీ చేశారు. అయితే ఇటీవల హుండీల లెక్కింపు జరగటంతో హుండీలో తక్కువ సొమ్ము మాత్రమే ఉండి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఆలయ ప్రధాన ద్వారాలు మూసివున్నా.. వాచ్‌మెన్, సీసీ కెమెరాలు ఉన్నా దొంగ చాకచక్యంగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి దొంగతనం చేయటం కలకలం చెలరేగింది. ఆలయ ప్రాంణంలో దిగిన దొంగ తిరిగి బయటకు ఎలా వెళ్లాడనేది మిస్టరీగా ఉంది. 

మహాగణపతి ఆలయంలోనూ.. 
కొండ పైమార్గంలో ఉన్న మరో శ్రీమహాగణపతి ఆలయంలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయం ప్రధాన ద్వారాలు మూసి ఉండటంతో దొంగ గుడి పక్కనే ఉన్న చెట్టుపై నుంచి ఆలయంలోకి దిగి గ్రిల్‌ తాళం పగులగొట్టాడు. ఆలయ హుండీని పగులగొట్టి సొమ్ము చోరీ చేశాడు. గత శివరాత్రి తరువాత హుండీ లెక్కించలేదని, దాదాపు రూ.50 వేల సొమ్ము పోయి ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. క్రైమ్‌ పోలీసులు, క్లూస్‌ టీమ్‌ రంగంలోకి సీసీ కెమెరా ఫుటేజీ, వేలిముద్రలు సేకరించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)