Breaking News

రాష్ట్రంలో స్కూళ్ల తలరాత మారింది

Published on Sun, 12/21/2025 - 03:40

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల పంచాయతీ పరిధిలోని తల్లెంవారిపల్లె అటవీ శివారు గ్రామం. 500 ఇళ్లున్న ఈ గ్రామం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చే దాకా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వ భవనం అంటూ ఒక్కటీ ఉండేది కాదు. 2019లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాగానే ఆ ఊరు రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. అభివృద్ధి పనులు పరుగులు తీశాయి. గ్రామంలోకి అడుగు పెట్టగానే గ్రామ సచివాలయ భవనం అందంగా కనిపిస్తుంది. 

దానికి కొంచెం దూరంలో సకల సౌకర్యాలతో నాడు–నేడు కింద కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా హైస్కూల్‌ ఏర్పాటు అయ్యింది. నగరాలు, పట్టణాల్లో ఉండే స్కూళ్లను మరిపిస్తూ రూపు దిద్దుకున్న ఈ స్కూల్లో ఇప్పుడు తల్లెంవారిపల్లెతో పాటు గాదెల పంచాయతీలోని ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, అరుంధతివాడ, కొత్తపల్లి అరుంధతివాడ, కొత్తపల్లి దళితవాడలతో పాటు జీవీ పురం, నూకనపల్లె, కిష్టంపల్లె గ్రామాల నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు.

పాములేరు వంకపై పాఠశాల రక్షణ గోడ సైతం నిర్మించారు. అన్నదాతలను అన్ని విషయాల్లో చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం  వెలిసింది. చుట్టుపక్క గ్రామాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటైంది. తల్లెంవారిపల్లె–కొత్తపల్లె, జీవీపురం–తల్లెంవారిపల్లె గ్రామాలకు సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. ఇలా తక్కువ సమయంలో గ్రామం అభివృద్ధిపథంలో దూసుకెళ్లింది. ఎంతలో ఎంత మార్పు.. అని గ్రామస్తులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పాలనను గుర్తు చేసుకుంటున్నారు.      – ఓబులవారిపల్లె

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)